106 ఏళ్ల వయసులో రన్నింగ్ రేసులో పాల్గొని బామ్మ సరికొత్త రికార్డ్. వినటానికి నమ్మేలా లేకున్నా ఇది నిజం. ఇటీవల జరిగిన 18వ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 106 ఏళ్ల ముసలవ్వ పాల్గొని సత్తా చాటింది.
106 ఏళ్ల వయసులోనూ ఓ బామ్మ తన సత్తా ఏంటో అందరికీ చూపించింది. పరుగు పందెంలో పాల్గొని ఏకంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 106 ఏళ్ల వయసులోనూ బామ్మ రన్నింగ్ రేసులో పాల్గొనడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా? అవును.. మీరు చదివింది నిజమే. 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని తన పవర్ ఏంటో చూపించింది. ఈ క్రీడల పోటీలను చూడటానికి వచ్చిన యువకులు అంతా ఆమె ప్రతిభను చూసి నోళ్లు వెళ్లబెట్టారు. ఇంతకు ఈ బామ్మ ఎవరు? ఆమెది ఏ రాష్ట్రం? ఆమె సాధించింది ఏంటనే పూర్తి వివరాలు మీకోసం.
హర్యానాలోని కద్మ గ్రామంలో రామాబాయి (106) అనే బామ్మ నివాసం ఉంటుంది. 100 ఏళ్లు దాటిన ఆమె ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఉత్తరఖాండ్ లోని డెహ్రుడూన్ లో 18వ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ప్రారంభమయ్యాయి. ఈ ఛాంపియన్ షిప్ పోటీల్లో హర్యానాకు చెందిన ఈ రామాబాయి కూడా పాల్గొంది. ఈ పోటీల్లో భాగంగా 100 మీటర్ల ఈ రన్నింగ్ రేసులో పాల్గొనడానికి ఈ బామ్మ ఉత్సాహం చూపించారు. ఇక మొత్తానికి ఈ రన్నింగ్ రేసులో పాల్గొని ఈ బామ్మ సత్తా చాటి ఏకంగా స్వర్ణం సాధించింది. ఈ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలకు హాజరైన చాలామంది రామాబాయి ఉత్సాహాన్ని చూసి షాకయ్యారు.