ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ నడుస్తుంది. దీని ప్రభావం క్రికెట్‌పై కూడా భారీగానే పడింది. ఇప్పటికే మన దేశవాళీ క్రికెటర్లు, బీసీసీఐ అధ్యక్షుడు కరోనా బారిన పడ్డారు. అలాగే యాషెస్ సిరీస్‌లో కూడా పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కరోనా సోకింది. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాక్స్‌వెల్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం మాక్స్‌వెల్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో మాక్స్‌వెల్ చికిత్స తీసుకుంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్‌వెల్ ఈ లీగ్ సందర్బంగానే వైరస్ బారిన పడ్డాడు.
Maxwell becomes the latest to test positive for covid-19 amidst the outbreak of the virus in the Melbourne Stars squad #BBL
— Cricbuzz (@cricbuzz) January 5, 2022
చివరి రెండు మ్యాచ్‌ల్లో మెల్‌బోర్న్ జట్టుకు మాక్స్‌వెల్ నాయకత్వం కూడా వహించాడు. ఆడిలైడ్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లోనే మాక్స్‌వెల్ కోవిడ్ బారిన పడి ఉంటాడని భావిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ సోకిన మెల్‌బోర్న్ జట్టులో 13వ వ్యక్తి మాక్స్‌వెల్. ఇప్పటికే ఆ జట్టులోని 8 మంది సహాయక సిబ్బందితోపాటు, నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంత భారీగా కరోనా కేసులు నమోదవడంతో బిగ్‌బాష్ లీగ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా క్రికెట్‌పై కరోనా ప్రభావంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర.. న్యూజిలాండ్ పై ఘన విజయం