రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేసి కేవలం ఒక ప్లేయర్‌గా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇదే విషయంపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్పందిస్తూ.. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్న విరాట్ కోహ్లీకి రెక్కలొచ్చాయని, అతను బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడతాడని అన్నాడు. కోహ్లీ విషయంలో బౌలర్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించాడు.
కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే ప్రత్యర్ధి బౌలర్లను చెడుగుడు ఆడిన కోహ్లీ.. ఇప్పుడు ఆ భారాన్ని వదులుకొని ఆటగాడిగా మారిన తరుణంలో అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదన్నాడు. ‘కెప్టెన్సీ ఒత్తిడి లేని కోహ్లీ, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ మునుపటి కంటే ప్రమాదకారిగా మారి ప్రత్యర్ధులపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడతాడు. కోహ్లీ కెప్టెన్ కాకముందు ఎలా దూకుడుగా ఉండేవాడో, ఐపీఎల్ 2022 సీజన్‌లో అలానే చెలరేగుతాడు. మళ్లీ మనం ఆ పాత కోహ్లీని చూడబోతున్నాం. కోహ్లీలో ఈ మార్పు ప్రత్యర్ధి జట్లకు ఎంత మాత్రం మంచిది కాదు.’అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.
11 ఏళ్ల పాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ ఒక్కసారి కూడా ఆ జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. బ్యాటింగ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు కోహ్లీ. ఐపీఎల్ 2016 సీజన్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదిన ఈ రన్ మెషీన్.. 973 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. అయితే తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో భంగపడటంతో ఆ జట్టు టైటిల్ కల కల్లగానే మిగిలిపోయింది. మరి ఈ సీజన్‌లోనైనా ఆర్సీబీ విజేతగా నిలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్: మాజీ ఓపెనర్
#GlennMaxwell said it is “amazing” to see a relaxed #ViratKohli and with the burden of captaincy gone, the former #RCB skipper could be “dangerous” for the opposition teams in #IPL2022https://t.co/WZuPDzSMv2
— CricketNDTV (@CricketNDTV) March 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.