IPL ఎప్పుడైతే ఆరంభం అయ్యిందో.. అప్పటి నుంచి చాలా దేశాలు తమదేశాల్లోనూ ఇలాంటి లీగ్ లు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వెస్డిండీస్.. కరేబియన్ లీగ్ ని, పాకిస్థాన్ పాక్ క్రికెట్ లీగ్ అని, తాజాగా సౌతాఫ్రికా సైతం సౌతాఫ్రికా లీగ్ న ప్రారంభించిన సంగతి మనకు తెసిందే. ఈ లీగ్ లు అన్ని ప్రారంభం కావడంతో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ కు పెద్ద దెబ్బతగిలింది. ఐపీఎల్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది బిగ్ బాష్ లీగ్. ఇక ఈ లీగ్ లో సూర్య కుమార్ ను ఆడించుకుంటారా? అని ఆసిస్ స్టార్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ను ప్రశ్నించగా పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సూర్యకుమార్ యాదవ్.. ఇతని ఆటను వర్ణించడానికి పదాలు చాలవు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు. సమకాలీన క్రికెట్ చరిత్రలో ఇన్ని ప్రశంసలు మరే ఇతర క్రికెటర్ పై కూడా కురిసి ఉండవు. తనదైన షాట్స్ తో, సొగసైన బ్యాటింగ్ తో.. అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని బిగ్ బాష్ లీగ్ లో ఆడించుకుంటారా అని ఆసిస్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ను అడగ్గా.. అతడు ఈ విధంగా స్పందించాడు.”సూర్యకుమార్ లాంటి ఆటగాడిని మా లీగ్ భరించలేదు. అతడు గనక మా బిగ్ బాష్ లీగ్ వస్తే.. మా ఆటగాళ్ల పని అయిపోయినట్లే. అదీ కాక సూర్యకుమార్ లాంటి ఆటగాడిని కొనాలంటే మా దగ్గర అంత మనీ లేదని” చెప్పుకొచ్చాడు మాక్సీ.
Glenn Maxwell on No.1 T20I cricketer Suryakumar Yadav.@Gmaxi_32 | @surya_14kumar | #NZvIND pic.twitter.com/j5IehaP3nb
— CricTracker (@Cricketracker) November 23, 2022
ఒక వేళ సూర్య ను కొనుగోలు చేయాలి అనుకుంటే.. టోర్నమెంట్ ప్రైజ్ మనీ మెుత్తం అతడిని కొనడానికే సరిపోతుందని సరదాగా అన్నాడు మాక్స్ వెల్. ఇక అతడిని కొనాలి అంటే మా జట్టులో ఉన్న అందరి ఆటగాళ్లని తొలగించాలని నవ్వుతూ.. చెప్పుకొచ్చాడు మాక్సీ. ఇక బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ స్టార్స్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు మాక్సీ. 2011లో ప్రారంభం అయిన ఈ లీగ్ లో ఇప్పటి వరకు మెల్బోర్న్ టీమ్ ఒక్కసారిగా కప్ గెలవలేదు. దాంతో మాక్స్ వెల్ సారథ్యంలో ఈ సారైనా కప్ కొట్టాలని వేయి కళ్లతో చూస్తోంది. మరి త్వరలోనే జరగబోయే ఈ టోర్నీలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాలి.
Glenn Maxwell (in The Grade Cricketer) said “We won’t be able to afford Suryakumar Yadav in BBL – we need to sack everyone, save the money and hope he agree. (big smile)”.
— Johns. (@CricCrazyJohns) November 23, 2022