క్రికెట్ అభిమానులకు షాక్. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ కి ప్రమాదం. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాక్స్‌వెల్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఐపీఎల్ ద్వారా బాగా పాపులర్ అయిపోయాడు. ఇక్కడ కూడా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. దిల్లీ, ముంబయి, పంజాబ్ జట్లకు ఆడిన మ్యాక్సీ.. ప్రస్తుతం బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నారు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లోనూ ఆసీస్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఇంటిముఖం పట్టింది. దీంతో ఆటగాళ్లు ఎవరికి వారు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మాక్స్‌వెల్ ప్రమాదానికి గురయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మ్యాచ్ లు పూర్తయిపోయిన తర్వాత మాక్స్‌వెల్ సొంతూరికి వెళ్లిపోయాడు. తాజాగా తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలకు అటెండ్ అయ్యాడు. ఎంజాయ్ చేస్తూ.. తన మిత్రుడితో కలిసి బ్యాక్ యార్డ్ లో పరుగెత్తాడు. కాలు మడతపడటంతో జారి కిందపడ్డాడు. దీంతో కాలు విరిగిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్ కు మ్యాక్సీ చాలాకాలం దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయపడ్డ మాక్స్‌వెల్ కు శనివారం సర్జరీ జరగనుంది. అతడు కోలుకునేందుకు ఎన్నాళ్లు పడుతుందనేది కూడా ఇంకా తెలియడం లేదు. వచ్చే వారం ఇంగ్లాండ్ సిరీస్ ఉంది. ఇప్పుడు మ్యాక్సీ గాయపడటంతో అతడి బదులు సేన్ అబాట్ ని ఎంపిక చేశారు.
ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు త్వరలో జరగబోయే బిగ్ బాష్ కొత్త సీజన్ మొత్తానికి మాక్స్‌వెల్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మెల్ బోర్న్ స్టార్స్ కు మ్యాక్సీ కెప్టెన్ గా ఉన్నాడు. ఇకపోతే ఫిబ్రవరిలో టీమిండియాతో జరిగే టెస్టు సిరీస్ కే ఇతడు అందుబాటులోకి రావొచ్చని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా మాక్స్‌వెల్ ప్రమాదంపై స్పందించిన ఆసీస్ జాతీయ సెలెక్టర్ జార్జ్ బెయిలీ.. ‘గ్లెన్ ధైర్యంగా ఉండు. త్వరగా కోలుకునేందుకు సాయం చేస్తాం’ అని అన్నారు. ‘మెల్ బోర్న్ స్టార్స్ లో మ్యాక్సీది కీ రోల్. అతడు త్వరగా కోలుకోవాలి. సీజన్ స్టార్టయ్యేటప్పటికీ అతడు తిరిగొస్తాడని ఆశిస్తున్నాం’ అని మెల్ బోర్న్ స్టార్స్ మేనేజర్ బ్లెయిర్ క్రౌచ్ చెప్పారు.
JUST IN: Glenn Maxwell has fractured his leg in a freak accident at a friend’s birthday party.
He slipped while running in a backyard with the friend and his leg became trapped.
The allrounder will be out for an extended period, starting with the ODIs against England next week. pic.twitter.com/EtS1P0kwTq
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2022