టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వారుసుడిగా టీమిండియాలోకి అడుగుపెట్టిన రిషభ్ పంత్.. టీ20 క్రికెట్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడు. సహజంగానే అగ్రెసివ్ బ్యాటర్ అయిన పంత్.. టెస్టుల్లో అదరగొడుతున్నా.. టీ20ల్లో మాత్రం విఫలం అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి ఫూర్ ఫామ్‌లో ఉన్నా కూడా.. పంత్‌ను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. జట్టులో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండాలనే ఉద్దేశంతో పంత్‌కు అవకాశం కల్పించారు. అలాగే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సైతం పంత్‌ను ఓపెనర్‌గా పంపి.. భారీగా అవకాశాలు ఇచ్చారు. అలాగే టీ20 వరల్డ్ కప్ సూపర్ 12ల్లో జింబాబ్వే మ్యాచ్‌తో పాటు ఎంతో కీలకమైన సెమీ ఫైనల్లోనూ ఛాన్స్ ఇచ్చారు.
కానీ.. పంత్ మాత్రం ఏ ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దారుణంగా విఫలం అవుతూ.. జట్టుకు భారంగా మారుతున్నాడు. అదే సమయంలో జట్టులో చోటు ఆశిస్తున్న మరికొంత యువ క్రికెటర్ల నుంచి కూడా భారీ స్థాయిలో పోటీ నెలకొనడంతో.. పంత్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌లో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న పంత్‌కు.. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ఇప్పటికీ ఊహించని స్థాయిలో పోటీ ఎదురవుతోంది. కేవలం టీమ్‌మేనేజ్‌మెంట్‌కు పంత్‌పై ఉన్న అతి నమ్మకమే అతన్ని ఇంకా జట్టులో కొనసాగిస్తోంది. వరుసగా పదికిపైగా మ్యాచ్‌ల్లో విఫలమైనా.. పంత్‌ను జట్టులో కొనసాగిస్తూ.. సెలెక్టర్లు సైతం విమర్శల పాలవుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు కిృష్ణమాచారి శ్రీకాంత్ సైతం పంత్‌ను పక్కనపెట్టాలని బీసీసీఐకి సూచించారు. రిషభ్ పంత్‌కు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా.. అతను దారుణంగా విఫలమవుతూ.. తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాడని.. అతనికి రెస్ట్ ఇవ్వాల్సిదేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైనా.. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు పంత్‌ను ఎంపిక చేశాడు. టీ20ల్లో తాతాల్కిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. పంత్‌ను ఏకంగా ఓపెనర్‌గా ఆడించి చేతులు కాల్చుకున్నాడు. కానీ.. సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 1-0తో టీమిండియా కివీస్‌పై టీ20 సిరీస్ గెలిచింది. ఇక వన్డేల్లో సైతం మరో తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం పంత్‌ను ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో పంత్ వల్ల సంజు శాంసన్‌కు అన్యాయం జరుగుతోందని క్రికెట్ అభిమానులు మొత్తుకుంటున్నా.. పంత్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.. అతను విఫలం అవుతూనే ఉన్నాడు.
Kris Srikkanth said, “India needs to give Rishabh Pant a break. It’s disappointing that he’s not utilising the chances he’s getting”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2022