టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ రెండు దేశాలు అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర భూకంపం ధాటికి రెండు దేశాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అలాగే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టర్కీ, సిరియాల్లో 2,300 మందికి పైగా మృతి చెందారని సమాచారం. టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో ఓ ఫుట్‌బాలర్ చిక్కుకున్నాడు. ఘనా టీమ్ నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్, మిడ్ ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు శిథిలాల మధ్య కనిపించాడు. అతడు చనిపోయాడేమోనని అందరూ అనుకున్నారు. క్రిస్టియన్ అట్సు ప్రాణాలతో ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న అతడ్ని అధికారులు కాపాడారు. ఈ విషయాన్ని టర్కీలోని ఘనా హైకమిషనర్ తెలిపారు.
31 ఏళ్ల క్రిస్టియన్ అట్సు.. టర్కిష్ లీగ్‌లో ‘హటయ్ స్పోర్ట్స్’ జట్టులో ఆడుతున్నాడు. భూకంప కేంద్రానికి సమీపంలోనే హటయ్ ప్రావిన్స్ ఉంది. అక్కడ కూడా భూకంపం ధాటికి పలు భవనాలు కూలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో శిథిలాల నడుమ క్రిస్టియన్ చిక్కుకున్నాడు. అట్సు ఆచూకీని కనిపెట్టిన అధికారులు.. అతడ్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఘనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్ స్టేషన్ మార్నింగ్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌కు కూడా క్రిస్టియన్ అట్సు గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూకాసిల్‌కు ఐదేళ్ల పాటు ఆడిన అట్సు.. 2021లో సౌదీ అరేబియా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రీసెంట్‌గా టర్కీష్ ఫుట్‌బాల్ క్లబ్‌కు మారాడు. ఘనా తరఫున 65 మ్యాచ్‌లాడిన అట్సూ.. 9 గోల్స్ చేశాడు.
Update: We’ve received some positive news that Christian Atsu has been successfully rescued from the rubble of the collapsed building and is receiving treatment.
Let’s continue to pray for Christian🙏🏽
— Ghana Football Association (@ghanafaofficial) February 7, 2023