టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాతో పాటు కరేబియన్ మాజీ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, దిగ్గజ ఆటగాళ్లు బ్రియన్ లారా, హర్షల్ గిబ్స్, తిలకరత్నే దిల్షాన్‌తో మరోసారి క్రికెట్ అభిమానులకు తమ క్రికెట్ విన్యాసాలతో వినోదం పంచేందుకు రెడీ అవుతున్నారు. అదేంటి.. వీళ్లంతా ఐపీఎల్‌లో ఆడటం లేదు కదా? అని కంగారు పడకండి. వీళ్లు ఆడేది ఐపీఎల్‌లో కాదు.. కేసీసీ లీగ్ 2023లో. కర్ణాటక వేదికగా జరిగే ఈ లీగ్‌లో మరో విశేషం ఏమిటంటే.. ఇది సినీ తారాల క్రికెట్ లీగ్.. తొలి సారి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఆడుతున్నారు. పైగా.. సురేష్ రైనా, క్రిస్ గేల్, బ్రియన్ లారా, హర్షల్ గిబ్స్, తిలక రత్నే దిల్షాన్, బద్రీనాథ్ లాంటి మాజీ క్రికెటర్లు ఆడేందుకు రెడీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
కన్నడ చలనచిత్రా కప్ పేరుతో జరుగుతున్న ఈ టీ10 లీగ్ ఫిబ్రవరీ 24న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు.. గంగా వారియర్స్, హోయసల ఈగల్స్, వడయార్ ఛార్జర్స్,
కదంబ లయన్స్, రాష్ట్రకూట పాంథర్స్, విజయనగర పెట్రియాట్స్ ఉన్నాయి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ మూడో సీజన్‌కు ముస్తాబు అవుతుంది. కన్నడ సినిమా స్టార్లతో పాటు ఈ సారి ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారని తెలియడంతో ఈ లీగ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కాగా.. ఈ లీగ్‌ను చెన్నై, బెంగుళూరు వేదికల్లో నిర్వహించనున్నారు. క్రికెట్ స్టార్లతో పాటు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, ధనంజయా, ఉపేంద్రా, ధృవ్, గణేష్ లాంటి సినిమా స్టార్లు కూడా పాల్గొననున్నారు. మరి ఈ లీగ్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్లు పాల్గొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gayle, Raina, Lara, Gibbs, Badrinath, Dilshan set to play in the Kannada Chalanachitra Cup 2023. (Source – News18)
— Johns. (@CricCrazyJohns) January 28, 2023