అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్. ప్రతి దేశం తమ జట్టుని ప్రకటిస్తోంది. ఈ మధ్య టీమిండియా కూడా టోర్నీ కోసం టీమ్ ను అనౌన్స్ చేసింది. అదుగో అప్పుడు మొదలైంది రచ్చ. వాళ్లెందుకు లేరు, వీళ్లనెందుకు తీసుకోలేదు. టీమ్ అలా ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు తాజాగా జరిగిన ఆసియాకప్ లో భారత్.. సూపర్ 4 దశలోనే ఇంటిముఖం పట్టడంపైనా చర్చిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా ప్రపంచకప్ జట్టు గురించి మాజీలు తలో రకంగా మాట్లాడుతున్నారు. గావస్కర్ మాత్రం భారత జట్టుని ఆకాశానికెత్తేశాడు. ఏకంగా కప్పు కొట్టేస్తుందని జోస్యం చెప్పాడు. అందుకు కావాల్సిన లక్, రోహిత్ సేనకు ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ అండ్ కో సుడి బాగుందని, ఈసారి కప్పుతోనే తిరిగొస్తారని గావస్కర్ అన్నాడు. విమర్శలపైనా స్పందించిన ఇతడు.. ఓసారి సెలక్షన్ పూర్తయిన తర్వాత మద్ధతివ్వాలి తప్ప ట్రోల్ చేయకూడదని అన్నాడు.
భారత జట్టు ఎంపిక గురించి మాట్లాడిన మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగసర్కారు కూడా షమీ, ఉమ్రన్ మాలిక్, శుభమన్ గిల్ ని జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అజహారుద్దీన్ అయితే.. జట్టుని చూసి షాకయ్యానని అన్నాడు. హుడా, హర్షల్ బదులు శ్రేయస్, షమీ ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఇకపోతే టీ20 ప్రపంచకప్ అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. మరి ఈ టోర్నీలో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందని అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: T20 World Cup 2022: ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. భారత్ దే టీ-20 వరల్డ్ కప్!