‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్న విషయం తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఏ విభాగం తీసుకున్నా అందరూ నిరూత్సహ పరుస్తూనే ఉన్నారు. వార్మమ్ మ్యాచ్‌లు మినహా ఆడిన రెండు మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన టీమిండియాను మాజీలు సహా అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ఇలాంటి ప్రదర్శన చేయడంపై అందరూ అసంతృప్తితో ఉన్నారు. కొందరు తమ అసహనాన్ని బాహాటంగానే వెల్లిబుచ్చుతున్నారు. కొందరు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారు. మాజీ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం మనసులోని మాట నేరుగా చెప్పేశాడు.
ముందుగా కెప్టెన్ కోహ్లీ గురించి ప్రస్తావించాడు గంభీర్. స్ట్రాటజిస్టుగా విరాట్ కోహ్లీ తనను ఎప్పుడూ ఇంప్రెస్ చేయలేదని చెప్పుకొచ్చాడు. అతని వ్యూహాలు అంత గొప్పగా ఏమీ ఉండవు. సత్ఫలను ఇచ్చేవి కావు అనే కోణంలో తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. మరోవైపు మెంటర్ ధోనీ గురించి కూడా కామెంట్ చేశాడు. న్యూజిలాండ్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, ఆటగాళ్లను మార్చడం చూస్తుంటే అది మెంటర్ ధోనీ వ్యూహాలుగా లేవని గంభీర్ అభిప్రాయ పడ్డాడు. ధోనీ కెప్టెన్సీలో తాను చాలా మ్యాచ్‌లే ఆడినట్లు.. అతని వ్యూహాలు ఎప్పుడూ ఆ విధంగా ఉండవని చెప్పుకొచ్చాడు. గంభీర్ మాటలను గమనిస్తే మెంటర్‌గా ధోనీ పాత్ర పెద్దగా లేదు టీమిండియాలో అనే కోణంలోనే చెప్పుకొచ్చాడు. టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.