ఆసియా కప్2022 లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో 23 పరుగుల తేడాతో శ్రీలంక పాకిస్థాన్ చిత్తు చేసింది. దాంతో మూడో సారి ఆసియా కప్ ను కైవసం చేసుకోవాలనుకున్న పాక్ కల కల గానే మిగిలింది. ఇక లంక దిగ్విజయంగా 6వ సారి ఆసియా కప్ ను సాధించింది. జట్టు సమష్టి కృషితో టోర్నీ ఆద్యాంతం పై చేయి సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం జట్టులోని ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం సహజమే. కానీ అనుకోని అతిథులు ఆ వేడుకలను మరింత ఆనందదాయకంగా చేస్తే.. ఆ కిక్కే వేరు. ఈ క్రమంలోనే లంక ఆసియా కప్ గెలిచిన సందర్భంగా భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మైదానంలోకి వచ్చి లంక అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా లంక లో పరిస్థితులు ఏమీ బాగాలేవు. లంక విపరీతమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అదీకాక అక్కడ రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. దాంతో దేశ పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ద్రవ్యోల్బణ పెరుగుదల వల్ల నిత్యవసరాల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమస్యల మధ్య ఆసియా కప్ లోకి అడుగుపెట్టిన లంకను అందరు చులకనగా చూశారు. అసలు సూపర్-4 లోకి అన్నా అడుగు పెడుతుందా అని ఎద్దేవ చేశారు. కానీ అనూహ్యంగా ఘర్జించిన లంక ఏకంగా ఆసియా కప్ టైటిల్ నే ఎగరేసుకుపోయింది. అయితే లంక గెలుపు అనంతరం గౌతమ్ గంభీర్ శ్రీలంక జాతీయ జెండాను చేత పట్టుకుని మైదానంలో సందడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక గంభీర్ తమ జాతీయ జెండాను పట్టుకోవడంతో లంక అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు. ఈ వీడియోని తన ట్వీటర్ ఖాతాలో గౌతమ్ పోస్ట్ చేశాడు.
ఇక ఈ విజయంపై స్పందిస్తూ..”సూపర్ స్టార్ టీమ్.. టైటిల్ గెలవడానికి మీరు నిజంగా అర్హులు. మీకు నా అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు. అయితే ఇదిలా ఉండగా అసలు శ్రీలంకలోనే ఈ ఆసియా కప్ జరగాల్సింది. కానీ అక్కడి దేశ సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా టోర్నీని దుబాయ్ కు మార్చాల్సి వచ్చింది. మేం టోర్నీని నిర్వహించలేం అని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. ఇక ఈ విషయంపై లంక కెప్టెన్ స్పందిస్తూ..”ఈ టోర్నీ మా దేశంలో జరగాల్సింది.. కానీ అనుకోని పరిస్థితులు దేశంలో తలెత్తాయి. సొంత దేశంలో కప్ ను మా అభిమానులకు అందించాలనుకున్నాం. అయినప్పటికీ దుబాయ్ లో కప్ గెలవడం మాకు సంతోషమే” అని పేర్కొన్నాడు. మరి లంకేయుల జెండాను పట్టుకుని వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న గౌతమ్ గంభీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe
— Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022
#Watch: #Gautamgambhir waved #SriLanka‘s flag after their #AsiaCup2022 victory#reels #reelsviral #reelsvideo #reelitfeelit pic.twitter.com/xtqB4NTvDA
— Oneindia News (@Oneindia) September 12, 2022