టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మంచి కెప్టెన్ అని కొనియాడాడు. అలాగే రోహిత్ శర్మ వల్ల నిద్రలేని రాత్రుళ్లు గడిపినట్లు గంభీర్ పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు ఇద్దరు కలిసే ఆడినా.. ఐపీఎల్‌లో మాత్రం ప్రత్యర్ధులుగా తలపడ్డారు.
ఈ క్రమంలో గంభీర్ మొదట్లో ఢిల్లీకి ఆడినా.. తర్వాత కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. తన కెప్టెన్సీలో కేకేఆర్‌ను రెండు సార్లు విజేతగా నిలిపాడు. కాగా 2011 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న రోహిత్ శర్మ.. రికీ పాంటింగ్ తర్వాత 2013లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి తన అద్భుత కెప్టెన్సీతో ముంబైను ఏకంగా 5 సార్లు విజేతగా నిలిపాడు. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఈ విషయంపై స్పందించిన గంభీర్.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ అనుసరించే వ్యూహాలతో తనకు నిద్రపట్టేది కాదని గంభీర్ తెలిపాడు. కాగా గంభీర్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటర్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి రోహిత్ శర్మ వ్యూహాలకు, గంభీర్ జవాబు ఇస్తాడో లేదో చూడాలి. మరి గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ రికార్డుకు రారాజు రిషభ్ పంత్! రోహిత్ అగ్రస్థానం గల్లంతు
.@GautamGambhir मुस्कुराइए, आप लखनऊ में हैं| ☺️🙏#GautamGambhir #TeamLucknow #TeamMentor #IPL #IPL2022 pic.twitter.com/xMTNs22wJo
— Lucknow Super Giants (@LucknowIPL) January 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.