ఫామ్‌లోని కేఎల్ రాహుల్‌ను ఈ బ్యాడ్ ఫేజ్ నుంచి బయటపడేసేందుకు గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగినట్లు ఉన్నాడు. ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన గంభీర్.. అతని బ్యాడ్ ఫామ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
భారత్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో కొనసాగుతున్నాడు. అతను ఏం చేసినా కలిసి రావడంలేదు. అదృష్టం బాగాలేకుంటే.. అరటి పండు తిన్నా పన్ను విరుగుతుంది అన్న చందాన, పాపం.. రాహుల్ మంచి షాట్ ఆడినా అవుట్ అవుతున్నాడు. కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేని రాహుల్.. దారుణ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలు జట్టులో అతన్ని ఆడించడమే శుద్ధదండగా అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. పైగా.. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ లాంటి యువ క్రికెటర్‌ను బెంచ్‌కు పరిమితం చేస్తూ.. ఫామ్‌లోలేని రాహుల్‌ను ఆడిస్తుండటం క్రికెట్ అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు. టెస్టు టీమ్‌కు వైస్ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ అనే వంకతో ఇన్ని రోజులు రాహుల్‌కు అవకాశాలు ఇస్తూ వచ్చారు.
కానీ రాహుల్ మాత్రం ఫామ్ అందుకోవడం లేదు. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులోనూ రాహుల్ దారుణంగా విఫలం అయ్యాడు.తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి అవుట్ అయిన రాహుల్.. 113 పరుగుల విజయ లక్ష్యంతో ఆరంభించిన రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ మంచి షాట్ ఆడినా.. షార్ట్ ఫీల్డర్ కాలికి బలంగా తాకి బంతి గాల్లోకి లేచింది. దాన్ని కీపర్ క్యాచ్ అందుకోవడంతో దురదృష్టవశాత్తు రాహుల్ అవుట్ అయ్యాడు. ఏ విధంగా అవుటైనా.. రాహుల్ వైఫల్యంలో ఇది కూడా ఒకటి. ఈ ప్రదర్శనతో రాహుల్‌ను మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేస్తారో? లేదో? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఢిల్లీలో కేఎల్ రాహుల్‌ను కలిసి చాలాసేపు మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గంభీరే గంట మొగించి మ్యాచ్ ఆరంభించాడు. అలాగే.. ఆటగాళ్ల ప్రాక్టీస్ సమయంలో కేఎల్ రాహుల్‌తో చాలా సేపు మాట్లాడాడు. ప్రస్తుతం నడుస్తున్న బ్యాడ్ ఫేజ్ నుంచి బయటపడేందుకు రాహుల్‌కు గంభీర్ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఐపీఎల్‌లో రాహుల్, గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్.. లక్నో టీమ్‌కు కెప్టెన్ కాగా.. గంభీర మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే గంభీర్ .. రాహుల్‌తో అతని ఫామ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir had a chat with KL Rahul. pic.twitter.com/BA3VpCSQ6m
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2023