‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ కథ ముగిసింది. సెమీస్-2లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. బై బై పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హోరాహోరీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. అయితే ఇప్పుడు వార్నర్ ఆడిన ఓ షాట్ గురించి సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది. ఎక్కడికెళ్లింది మీ క్రీడా స్ఫూర్తంతా అంటూ ఆస్ట్రేలియా క్రికెట్రలు మొదలు మాజీల వరకు అందర్నీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు.
What an absolutely pathetic display of spirit of the game by Warner! #Shameful What say @ashwinravi99? pic.twitter.com/wVrssqOENW
— Gautam Gambhir (@GautamGambhir) November 11, 2021
అసలు రచ్చ వార్నర్ కొట్టి ఆ సిక్సు వల్లే మొదలైంది. 8వ ఓవర్ వేసేందుకు వచ్చిన హఫీజ్ ఫస్ట్ బాల్ వేసేందుకు రాగా.. బాల్ చేజారింది. ఆ బాల్‌ను రెండో బౌన్స్ అయ్యాక వార్నర్ సిక్సు కొట్టాడు. అయితే దానిని డెడ్ బాల్ అనేందుకు ఎలాంటి రూల్స్ లేవు. అంపైర్ ఆ బాల్‌ను నోబాల్‌గా నిర్ణయించాడు. వార్నర్ ఆ షాట్ వల్లే గౌతమ్ గంభీర్‌కు కోపం ముంచుకొచ్చింది. ‘వార్నర్ క్రీడాస్ఫూర్తి ఎంత దయనీయంగా ఉంది? సిగ్గు చేటు’ అంటూ తీవ్రంగా స్పందించాడు. ఈ విషయంపై అశ్విన్‌ను కూడా నువ్వేమంటావు అని ప్రశ్నించాడు. అందుకు అశ్విన్ ‘వార్నర్ ఆడిన ఆ షాట్ కచ్చితంగా అద్భుతమైనది. గొప్ప షాట్’ అంటూ అశ్విన్ వ్యగ్యంగా స్పందించాడు.
Absolutely it was a wonderful hit by @davidwarner31 👏👏. Great shot
— Ashwin 🇮🇳 (@ashwinravi99) November 12, 2021
ఐపీఎల్‌లో అశ్విన్ మాన్కడింగ్ చేసిన సమయంలో అందరూ అతడిని తప్పుబట్టటారు. వార్నర్ ఆడిన ఆ షాట్ గురించి ఎవ్వరూ స్పందించకపోవడం వల్లే గౌతమ్ గంభీర్ ఇంత తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. గౌతమ్ స్పందించిన తీరును తప్పుబట్టిన ఆస్ట్రేలియా రైటర్‌కు అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే.. అప్పుడు అదీ కరెక్టే(అశ్విన్ మాన్కడింగ్ సందర్భాన్ని). ఇప్పుడు ఇది తప్పు అయితే.. అప్పుడు అదీ తప్పే’ అని గౌతమ్ భావిస్తున్నట్లు అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు.
His point is that if this is right , that was right. If that was wrong , this is wrong too. Fair assessment? @plalor
— Ashwin 🇮🇳 (@ashwinravi99) November 12, 2021
Warner Be Like :- Sala Dauda Kar Marunga 🤣🤣🤣🤣@davidwarner31 @aajtak#AUSvPAK #Pakistan #PakistanTeam #PCB #Warner #DavidWarner #Australia #T20WorldCup #PakistanCricket pic.twitter.com/GA0VtqaFnB
— Gautam Prajapati (@prajapati__jii) November 12, 2021