కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేకుండా ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది మాజీ క్రికెటర్లు రాహుల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా గంభీర్ మాట్లాడూతూ..
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫామ్‌పై రోజుకో చర్చ జరుగుతూనే ఉంది. ఫామ్‌లోలేని రాహుల్‌ను జట్టులోంచి తప్పించాలంటూ క్రికెట్ అభిమానుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కొంతమంది మాజీ క్రికెటర్లు రాహుల్‌కి అండగా నిలబదుతున్నారు. ఈ విషయం అతని ఫ్యాన్స్ కి కాస్త ఊరట కలిగిస్తుంది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ రాహుల్ ఫామ్‌పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై ఆకాష్ చోప్రా స్పందిస్తూ “రాహుల్‌ని కావాలనే టార్గెట్ చేయడంలో అర్థం లేదు” అని రాహుల్ ని వెనుకేసుకొని వచ్చాడు. అలాగే మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం.. ‘ఒక ఆటగాడు ఫామ్ లేనంత మాత్రనా ఇంతలా విమర్శించడం కరెక్ట్ కాదు. ఈ ఆటగాడైన ఫామ్ లో లేకపోతే ముందుగా మనకంటే అతనికి, అతని కుటుంబ సభ్యులకే ఎక్కువగా బాధ ఉంటుంది. ఒక ఆటగాడిని ఇలా పదే పదే విమర్శంచడం వలన మానసికంగా కృంగిపోతాడు. ఇదే స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారు?’ అంటూ తనదైన శైలిలో రాహుల్‌కి సపోర్ట్‌గా మాట్లాడాడు.
వీరితో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. ‘ఒక ప్లేయర్ సరిగ్గా ఆడటం లేదని, అతన్ని జట్టు నుంచి తప్పించాలి ఎవరూ చెప్పకూడదు. క్రికెట్ పండితులకి సైతం ఇలా చెప్పే హక్కు లేదు. కెరీర్ ప్రారంభంలో రోహిత్ శర్మ కూడా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత భారత జట్టు అతడి మీద నమ్మకముంచి వరుస అవకాశాలిచ్చింది. ఇప్పుడతను టీమిండియాకు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. రాహుల్ కి కూడా అలాంటి అవకాశాలు ఇవ్వాలి. అతడిని జట్టునుండి తప్పించకూడదు”.అని చెప్పుకొచ్చాడు.
అయితే రాహుల్‌పై గత కొంతకాలంగా ఫామ్‌లో లేడని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున విషయం తెలిసిందే. కేవలం టెస్టుల్లోనే కాదు ఫార్మాట్ ఏదైనా రాహుల్ విఫలముతున్నాడు. రాహుల్ గత చివరి 10 ఇన్నింగ్స్ ల్లో కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోవడం అతని ఫామ్ ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తుంది. మరి గంభీర్ చెప్పినట్టు తర్వాత రెండు టెస్టుల్లో రాహుల్ ని కొనసాగిస్తారా? లేదా అనే విషయం తెలియసి ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1న ఇండోర్ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. మొత్తానికి రాహుల్‌కి గంభీర్ సపోర్ట్ చేసిన విధానం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir responds to KL Rahul’s criticism.#KLRahul | #GautamGambhir pic.twitter.com/e87SMqoaLB
— CricTracker (@Cricketracker) February 23, 2023