BCCI-సౌరవ్ గంగూలీ.. గత కొన్ని రోజులుగా భారత క్రీడా ప్రపంచంలో మారుమ్రోగుతున్న పేర్లు. దానికి కారణం గంగూలీని రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు కార్యవర్గ సభ్యులు అంగీకరించకపోవడమే అని వార్తలు వస్తున్నాయి. తాజాగా బంధన్ బ్యాంక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా దాదా నియమించబడ్డాడు. ఈ కార్యక్రమానికి హాజరైన గంగూలీ.. తొలిసారి బీసీసీఐ పదవి నుంచి తొలగించిన వార్తలపై స్పందించాడు. “అవును బీసీసీఐ అధ్యక్ష్యపదవి నుంచి తప్పుకున్నాను”అని వెల్లడించాడు. ఇక గంగూలీ తర్వాత ఆ పదవిని చేపట్టడానికి రోజర్ బిన్ని సిద్ధంగా ఉన్నట్లు.. క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని విధాలుగా బీసీసీఐ అధ్యక్షపదవికి బిన్ని అర్హుడని రవిశాస్త్రి కూడా అతడికి మద్ధతు పలికాడు.
సౌరవ్ గంగూలీ-జై షాలు బీసీసీఐ అధ్యక్షుడు, సెక్రటరీలుగా నియమితులు అయినప్పటి నుంచి వారిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీలో జాయిన్ కానందుకే గంగూలీని అధ్యక్షపదవి నుంచి తొలగించారని టీఎంసీ ఎంపీలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదీ కాక సొంత తమ్ముడిగా ఉన్న అమిత్ షా కుమారుడు జై షా.. గంగూలీకి వెన్నుపోటు పొడిచాడని దాదా అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం దాదా బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పొవడంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ దాదా ఇంత వరకు స్పందించలేదు. తాజాగా బీసీసీఐ పదవి నుంచి తప్పుకోవడంపై తొలిసారి స్పందించాడు దాదా.
ఈ కార్యక్రమంలో లో గంగూలీ మాట్లాడుతూ..”పరిపాలకుడిగా చాలా కాలమే నేను పనిచేశాను. తాజాగా ఆ పదవి నుంచి తప్పుకున్న మాట వాస్తవమే. అయితే ఆ పదవి కంటే ఉన్నతమైన పదవిని చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాను. ఏ ఆటగాడైనా జీవితకాలం ఆడలేడు. అలాగే ఎవరు కూడా శాశ్వతంగా ఒకే పదవిలో ఉండలేరు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్లేయరైనా, రూలరైనా ఏదో ఒక రోజు తప్పుకోవాల్సిందేనని.. ఏ వ్యక్తీ ఒక్కరోజులో అంబానీ, నరేంద్ర మోదీలు కాలేరని అన్నాడు. ఆ స్థాయికి చేరాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలని ఈ సందర్బంగా దాదా చెప్పుకొచ్చాడు. ఇన్ని విషయాలు మాట్లాడిన దాదా బీజేపీ, రాజకీయాల గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.
We are happy to announce Sourav Ganguly as our new brand ambassador. Fondly called Dada and The Maharaja of Indian Cricket, Sourav Ganguly will be the voice of brand #BandhanBank and will help us take our message to the masses. Welcome on-board, Dada!@SGanguly99 #BandhanKaDada pic.twitter.com/w1Ytr7BwxO
— Bandhan Bank (@bandhanbank_in) October 13, 2022
“I have seen the rise of brand Bandhan from close quarters, & I am proud of the progress it has made in such a short time span. What I admire most about the bank is that it is a purpose-led brand & is committed to creating sustainable impact at the ground level.” @SGanguly99 pic.twitter.com/ja8JjvJ6Gq
— Bandhan Bank (@bandhanbank_in) October 13, 2022