ఐపీఎల్.. మరికొన్ని రోజుల్లో సగటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఐపీఎల్ లో పెద్ద స్టార్లు గా ఎదిగే టాప్-5 యంగ్ ప్లేయర్స్ ను సెలక్ట్ చేశాడు సౌరవ్ గంగూలీ.
మరికొన్ని రోజుల్లో క్రికెట్ పండగ స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే IPL ఫ్రాంఛైజీలు అన్ని తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ సారి ఐపీఎల్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ భవిష్యత్ లో స్టార్ ఆటగాళ్లుగా మారే ఐదుగురు ప్లేయర్స్ ను సెలక్ట్ చేశాడు దాదా. అయితే ఈ ఐదుగురు యంగ్ ప్లేయర్స్ లో సూర్యకుమార్ యాదవ్ కు చోటు ఇవ్వలేదు గంగూలీ. మరి IPLలో టాప్-5 క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్.. మరికొన్ని రోజుల్లో సగటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో పెద్ద స్టార్లు గా ఎదిగే టాప్-5 యంగ్ ప్లేయర్స్ ను సెలక్ట్ చేశాడు సౌరవ్ గంగూలీ. ఈ యువ ఆటగాళ్లలో మెుదటి స్థానానికి పృథ్వీ షాని ఎంపిక చేసుకోగా.. ఆ తర్వాత రెండు మూడు స్థానాలకు రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ లను తీసుకున్నాడు. మిగతా ఇద్దరిలో టీమిండియా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్, శుభ్ మన్ గిల్ లు ఉన్నారు. ఈ ఐదురుగురే ఐపీఎల్ లో టాప్-5 యంగ్ ప్లేయర్స్ అని సౌరవ్ తెలిపాడు. పంత్ ఈసారి ఐపీఎల్ ఆడనప్పటికీ అతడిని ఎంపిక చేశాడు దాదా.
ఈలిస్ట్ లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను చోటు కల్పించలేదు గంగూలీ. ఇక సూర్య కుమార్ కు 30 సంవత్సరాలు దాటడంతో.. అతడిని స్పెషల్ కేటగిరీలో తీసుకున్నాడు. వీరందరు ఎలాంటి ఆటగాళ్లో మీకు తెలిసిన విషయమే అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక ఈ షోలో గంగూలీతో పాటుగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ కూడా పాల్గొన్నాడు. యంగ్ ప్లేయర్ గిల్ గురించి బజ్జీ అడగ్గానే అతడిని ఈ జాబితాలో చేర్చాడు గంగూలీ. సరిగ్గా ఐదో ఆటగాడిగా గిల్ పేరు నా మనసులో మెదిలింది అని అన్నాడు దాదా. మరి దాదా ఎంపిక చేసిన టాప్-5 ఆటగాళ్లలో మీ అభిమాన ప్లేయర్ ఎవరో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.