గౌతమ్ గంభీర్.. గత కొన్ని రోజులుగా క్రీడా ప్రపంచంలో నానుతున్న పేరు. తన దైన శైలిలో క్రికెట్ విశ్లేషణ చేస్తూ.. ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే అనేక విమర్శలను సైతం గంభీర్ ఎదుర్కొంటున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో ఆసియా కప్ విజేత శ్రీలంక తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు గంభీర్. అతడు చెప్పిన మరునాడే పసికూన నమీబియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది లంక. దాంతో గంభీర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ భాజాపా ఎంపీ. విరాట్ కోహ్లీని ఉద్దేశించి.. రికార్డుల కోసం ఆట ఆడొద్దు జట్టు గెలవడానికి ఆడాలి అంటూ.. వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
గౌతమ్ గంభీర్.. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్ లు.. టీమిండియా గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కానీ అనుకుంత పేరు మాత్రం రాలేదు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ప్రజలకు సేవ చేస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా తనదైన శైలిలో క్రికెట్ విశ్లేషణలు చేస్తుంటాడు. ఇప్పటికే ధోని పై పదే పదే విమర్శలు చేస్తాడు అనే అపవాదు మూటగట్టుకున్న గౌతమ్.. మరో సారి తన నోటికి పనిచెప్పాడు. ఈ సారి టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీపై మండి పడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. “ఏ ఆటగాడైన జట్టు గెలవడానికి పరుగులు చేయాలి కానీ.. సొంత రికార్డుల కోసం కాదు. ఏ జట్లు గెలవనప్పుడు ఎన్ని రికార్డులు సాధిస్తే ఏం లాభం.
ఇక ఇదే విషయాన్ని కోహ్లీకి అన్వయిస్తూ.. కోహ్లీ నువ్వు చేసిన రన్స్ నీ టీమ్ ను గెలిపించక పోతే నువ్వు రన్స్ చేసి ఎందుకు? నీ రికార్డుల కోసం, నీ కోసం ఆడకు. జట్టు కోసం.. దేశం కోసం ఆడు. ఎందుకు నువ్వు ఎప్పుడూ.. వ్యక్తిగత స్కోరు, రికార్డులపైనే దృష్టిపెడతావు ఎందుకు? జట్టు కప్ గెలవలేనప్పుడు వ్యక్తిగాత రికార్డులు ఎందుకూ పనికిరాని చెత్తకాగితాలుగానే మిగిలిపోతాయి” అంటూ కాస్తా ఘాటుగానే స్పందిచాడు. దాంతో గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు కోహ్లీ ఫ్యాన్స్. “కోహ్లీ అంటే ఎందుకు భయ్యా నీకంత కోపం”. గంభీర్ కు కోహ్లీని చూస్తే.. అసూయ, అందుకే ఎప్పుడూ విమర్శిస్తుంటాడు” కోహ్లీ ఎప్పుడూ జట్టు కోసమే ఆడుతాడు.. నీ కెందుకు అలా అనిసిస్తోంది” అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
Gautam Gambhir explains how Virat Kohli should set his mindset in the #T20WorldCup 2022.
(via Star Sports) pic.twitter.com/4nwO3Akl3r
— CricTracker (@Cricketracker) October 17, 2022
He’s jealous of Virat Kohli .. @imVkohli never run for individual records.. He’s always a team player.. He scores for India not for himself. How can u say like that😏
— Inspired by Virat 💯🖤🤗 (@InspiredByVirat) October 17, 2022