దేశంలో ఐపీఎల్ 16వ సీజన్ సందడి అప్పుడే మొదలైంది. రాబోవు సీజన్ లో ఎవరెవరిని బరిలోకి దించాలన్నా దానిపై ప్రాంఛైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. అందులోనూ ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 ఆఖరు తేదీ కావడంతో.. అన్ని ప్రాంఛైజీలు రిలీజ్, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందజేశాయి. అలా చేయడం ద్వారా అన్ని జట్లు తమ పర్స్ విలువను పెంచుకున్నాయి. దీంతో మినీ వేలంలోఈ డబ్బుతో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అత్యధికంగా సన్ రైజర్స్ పర్సులో రూ. 42.25 కోట్లు ఉండగా, అత్యల్పంగా కోల్కతా నైట్ రైడర్స్ పర్సులో రూ. 7.05 కోట్లు ఉంది.
సన్రైజర్స్ రిటైన్ లో భాగంగా 12 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ని తో పాటు నికోలస్ పూరన్, సీన్ అబాట్, రొమారియో షెపర్డ్ వంటి పెద్ద ఆటగాళ్లను కూడా సాగనంపింది. దీంతో ఎస్ఆర్హెచ్ పర్స్ విలువ రూ.42.25 కోట్లకు చేరింది. ఇంత పెద్ద మొత్తం ఉన్నప్పుడు మినీ వేలంలో మినీవేలంలో కావ్యా పాప చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
#OrangeArmy, here are the #Risers who will continue to be a part of our journey for #IPL2023 🧡 #SunRisersHyderabad pic.twitter.com/B3ExEz8bP3
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022
పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ తో సహా మొత్తం 9 మందిని రిలీజ్ చేసింది. దీంతో పంజాబ్ పర్స్ విలువ రూ.32.20 కోట్లకు చేరింది. జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
గత సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. సెమీఫైనల్ కు చేరింది. రిటైన్ లో భాగంగా లక్నో 7 మంది ఆటగాళ్లను వదులుకుంది. దీంతో పర్స్ విలువను రూ. 23.35కు చేరింది. జట్టులో నాలుగు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
Thank you all for a 𝐒𝐮𝐩𝐞𝐫 𝐆𝐢𝐚𝐧𝐭 first season! 🫶🤗
Each one of you made invaluable contributions to #LSG, and we wish you a #Bhaukaal journey ahead. 💚#IPL2023 | #LucknowSuperGiants pic.twitter.com/nChzpYT1i6
— Lucknow Super Giants (@LucknowIPL) November 15, 2022
గత సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి జట్టులో భారీ మార్పులు చేసింది. మొత్తం 13 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసి.. పర్స్ విలువను రూ. 20.55 కోట్లకు పెంచుకుంది. జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు మిగిలి ఉన్నాయి.
కెప్టెన్ల మార్పుతో గత సీజన్ లో దారుణ ప్రదర్శన కనపరిచిన ధోని సేన.. ఈసారి బలంగానే బరిలోకి దిగేలా కనిపిస్తోంది. డ్వేన్ బ్రేవో, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే వంటి అవసరం లేని ఆటగాళ్లను వదులుకొని.. పర్స్ విలువను రూ.20.45 కోట్లకు పెంచుకుంది. జట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
Sending all the Yellove! We will cherish the moments we whistled as you roared in the middle! We Yellove You, Singams! 🦁💛#WhistlePoduForever
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2022
ఢిల్లీ క్యాపిటల్స్ 5 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం క్యాపిటల్స్ పర్స్ విలువ.. రూ. 19.45 కోట్లు. జట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
ఐపీఎల్ 2022 ఛాంపియన్ గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ 6 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. దీంతో లక్నో పర్స్ విలువ రూ.19.25 కోట్లకు చేరింది. జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్లాట్స్ మిగిలి ఉన్నాయి.
Forever one of us. Because #RoyalsFamily is a forever thing. 💗 pic.twitter.com/f8JsMMcOsX
— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2022
రాయల్స్ 8 మంది ఆటగాళ్లను వదులుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పర్స్ విలువ 13.20 కోట్లు. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
‘ఈసారి కప్ నామ్ దే..’ అనే స్లోగన్ ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే ఆర్సీబీ ఈసారి ఆ ఆశలను నిజం చేసుకునేలా కనిపిస్తోంది. ఆర్సీబీ 5మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. దీంతో పర్స్ విలువ రూ.8.75 కోట్లకు చేరింది. జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లుమిగిలి ఉన్నాయి.
Believe in the core!
12th Man Army, here are our 𝗿𝗲𝘁𝗮𝗶𝗻𝗲𝗱 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 who will be a part of RCB’s #Classof2023!#PlayBold #WeAreChallengers pic.twitter.com/aQCnh2K66E
— Royal Challengers Bangalore (@RCBTweets) November 15, 2022
ప్రతి సీజన్ లోనూ అంచనాలకు మించి రాణించే రైడర్స్, గత సీజన్ లో మాత్రం అలాంటి ప్రదర్శన కనపరచలేకపోయింది. దీంతో జట్టులో ప్రక్షాళన చేపట్టింది. మొత్తంగా 16 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇంతమందిని వదులుకున్న కేకేఆర్ పర్స్ విలువ రూ. 7.05 కోట్లే కావడం గమనార్హం. జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
🚨 KKR Retention news for TATA IPL 2023
𝐏𝐥𝐚𝐲𝐞𝐫𝐬 𝐑𝐞𝐭𝐚𝐢𝐧𝐞𝐝 👉 11
𝐏𝐥𝐚𝐲𝐞𝐫𝐬 𝐓𝐫𝐚𝐝𝐞𝐝 𝐈𝐧 👉 3
𝐏𝐮𝐫𝐬𝐞 𝐥𝐞𝐟𝐭 👉 7.05 Cr#AmiKKR #IPLRetention
— KolkataKnightRiders (@KKRiders) November 15, 2022
Purse remaining for teams at IPL 2023 Auction:
SRH – 42.25.
Punjab Kings – 32.20cr.
Lucknow Supergiants – 23.35cr.
Mumbai Indians – 20.55cr.
CSK – 20.45cr.
DC – 19.45cr.
Gujarat Titans – 19.25cr.
Rajasthan Royals – 13.20cr.
RCB – 8.75cr.
KKR – 7.05cr.— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2022