‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో భారత్ ఆరంభం నుంచి తడబడుతూనే ఉంది. వార్మప్ మ్యాచ్‌లు మినహా మిగిలిన రెండు మ్యాచ్‌లు ఘోర పరాభవాలే ఎదురయ్యాయి. పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫలితమే మళ్లీ రిపీట్ అయ్యింది. న్యూజిలాండ్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపించింది. 20 ఓవర్లలో 110 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. మరోవైపు మనకు భిన్నంగా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో న్యూజిలాండ్ ఎంతో ప్రతిభను కనబరిచింది. ముఖ్యంగా కేన్ మామ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యింది. మన బ్యాట్స్‌మెన్ల వీక్‌నెస్‌ని బట్టి బౌలర్‌ను ఇంట్రడ్యూస్ చేసి.. సఫలీకృతమయ్యాడు. భారత్ ఓటమి వెనుక మరో సెంటిమెంట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ ఓటమిలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ పేరు బాగా వినిపిస్తోంది.
ఇదీ చదవండి: కోహ్లీ సేన సెమీస్ చేరాలంటే.. అద్భుతాలు జరగాలి!
ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బోరోగ్ చేసింది ఏమీ లేదు గానీ.. 2014 నుంచి టీమిండియా ప్రతి నాకౌట్ మ్యాచ్‌కు అతనే అంపైర్. న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ అనగానే అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదే సెంటిమెంట్ రిపీట్ కాకూడదని కోరుకున్నారు. కానీ అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయ్యింది. మళ్లీ టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. 2014 టీ వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లకు ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బోరోగ్. అదనమాట సంగతి ఎందుకు రిచర్డ్ కూడా కారణం అని చెప్పామో. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా మరీ పేలవంగా ప్రదర్శన చేస్తోంది. ఎన్ని వ్యూహాలు రచించినా ఆచరణలో మాత్రం అంతా శూన్యంగానే ఉంది. టీమిండియా ప్రదర్శనపై ఐపీఎల్ ప్రభావం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.