సాధారణంగా ఓ జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్ సాధిస్తే.. తరువాత జరిగే పోటీల్లో ఆ జట్టుపై ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. అలాంటి జట్టు ఒకసారి క్వాలిఫయింగ్ దశలో వెనుతిరిగితే ఏదో పొరపాటున జరిగింది అనుకుంటాము. మరల అలానే క్వాలిఫయింగ్ దశలో వెనుతిరిగి ప్రపంచకప్ కి దూరమైతే.. ఇక ఆ జట్టు పరిస్థితి ఏంటి? తాజాగా ఆ పరిస్థితి ఇటలీ కి వచ్చింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకందాం..
నాలుగుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఇటలీ.. 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ప్లే–ఆఫ్ సెమీఫైనల్లో ఇటలీ 0–1తో నార్త్ మెసెడోనియా చేతిలో పరాజయం చవిచూసింది.”యూరో ఛాంపియన్” అయిన ఇటలీ వరుస ప్రపంచకప్‌లకు దూరమవడం అభిమానుల్ని నిర్ఘాంతపరుస్తోంది. ఇటలీ ఫుట్‌బాల్ ప్రియుల్ని అత్యంత నిరాశపరిచే ఫలితమిది. గత 2018 ప్రపంచ కప్ లోనూ ఈ మేటి జట్టు క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. ఫుట్ బాల్ ప్రపంచ కప్-2022 కి జరుగుతున్న క్యాలిఫయింగ్ మ్యాచ్ లో నార్త్ మెసెడోనియాతో ఇటలీ తలపడింది. ఈ మ్యాచ్ ఇటలీ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగిన ముగింపు దశలో ఏమర పాటుతో పరాజయం చవిచూసింది.
ఇటలీ డిఫెన్స్‌ని ఛేదించి ట్రాజ్‌కొవ్‌స్కీ ఇంజ్యూరీ టైమ్ లో చేసిన గోల్ చేశాడు. దీంతో ప్లే–ఆఫ్ సెమీఫైనల్లో ఇటలీ 0–1తో నార్త్ మెసెడోనియా చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు అర్జెంటీనా, బ్రెజిల్ తర్వాత దక్షిణ అమెరికా ఖండం నుంచి తాజాగా ఈక్వెడార్, ఉరుగ్వే ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. నాలుగు సార్లు ఫుట్ బాల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టు ఇలా వరుసగా క్యాలిఫయింగ్ దశలో ఇంటి దారి పట్టడం అదరిని ఆశ్చర్యపరిచింది. మరి.. ఈ నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన జట్టు క్యాలిఫయింగ్ లో వెనుతిరగడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.