స్వదేశంలో జరుగుతున్న టెస్టు మ్యాచులో పసికూన ఐర్లాండ్ పై శ్రీలంక తన ప్రతాపం చూపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేయడం విశేషం. వీటిలో 200 పరుగుల భాగస్వామ్యాలు రెండు రాగా.. ఒక 100 పరుగుల భాగస్వామ్యం వచ్చింది.
ఆహా అదేమి ఆట. దిగిన ప్లేయర్లు కనీసం సెంచరీ కొట్టాలనే లక్ష్యంతో వచ్చినట్టున్నారు. కొడితే సెంచరీ.. కుదిరితే డబల్ సెంచరీ అనేలా శ్రీలంక బ్యాటింగ్ కొనసాగింది. స్వదేశంలో జరుగుతున్న టెస్టు మ్యాచులో పసికూన ఐర్లాండ్ పై శ్రీలంక తన ప్రతాపం చూపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఇలా ఒకే టెస్టులో నలుగురు శ్రీలంకన్ల ప్లేయర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటి సారి కాకపోయినా .. వీరిలో ఇద్దరు డబుల్ సెంచరీలు కూడా చేయడం గమనార్హం.
గాలే వేదికగా శ్రీలంక, ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ 496 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు. పసికూన అయినప్పటికీ ఐర్లాండ్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక బ్యాటర్లు.. ఐర్లాండ్ కి చుక్కలు చూపించారు. నలుగురు బ్యాటర్ల సెంచరీలతో 704 పరుగులు చేసి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. మొత్తం 151 ఓవర్లు వేసిన ఐర్లాండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే తీశారు. 200 పరుగుల భాగస్వామ్యాలు రెండు రాగా.. ఒక 100 పరుగుల భాగస్వామ్యం వచ్చింది.
ఇక బ్యాటర్లలో కెప్టెన్ కరుణ రత్నే (115) తన అద్భుత ఫామ్ ని కొనసాగించగా.. సీనియర్ ప్లేయర్ మాత్యుస్(100) కూడా సెంచరీతో రాణించాడు. ఇదిలా ఉండగా మరో ఇద్దరు లంక ప్లేయర్లు తొలి సారి డబుల్ సెంచరీ మార్క్ ని టచ్ చేశారు. మధుష్క 205 పరుగులు చేస్తే ఇక కుశాల్ మెండీస్ అయితే ఏకంగా 245 పరుగులు చేసాడు. వీరిలో మధుష్క,కుశాల్ మెండీస్ తమ బెస్ట్ స్కోర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇక నాలుగవ రోజు ముగిసేసరికి ఐర్లాండ్ 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ఇంకా 158 పరుగులు వెనకబడి ఉన్న ఐరీష్ జట్టు ఓటమినుండి బయటపడాలంటే చివరి రోజు శ్రీలంక బౌలర్లను ఆపాల్సిందే. మరి నలుగురు శ్రీలంక ప్లేయర్లు సెంచరీ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.