ఇటీవల క్రీడా, సినీ, రాజకీయ రంగాల్లో ప్రముఖులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. వెస్టిండీస్ క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. మాజీ టెస్టు క్రికెటర్ బ్రూస్ పైరౌడో కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
1931 ఏప్రిల్ 14 న ఆయన జన్మించారు. వెస్టిండీస్ తరుపు నుంచి ఆయన పదమూడు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు. ఒక సెంచరీతో ఆయన 454 పరుగులు చేశాడు. ఆ సెంచరీ కూడా బ్రూస్ పైరౌడో 1953 లో టీమ్ ఇండియాపై సాధించారు. ఇక బ్రూస్ పైరౌడో వెస్టిండీస్ టీమ్ తరుపు నుంచి న్యూజిలాండ్ పర్యటన వచ్చారు. ఆ సందర్భంగా ఒక యువతి చూసి ప్రేమలో పడ్డారు.. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
వివాహం జరిగిన తర్వాత ఆయన వెస్టిండీస్ వదిలి న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అప్పట్లో ఆయన న్యూజిలాండ్ తరుపు నుంచి పలు టోర్నీలో ఆడారారు. బ్రూస్ పైరౌడో వద్ద శిక్షణ పొందిన ఎంతో మంది ప్రస్తుతం స్టార్ క్రికెటర్లుగా రాణిస్తున్నారు. 1967 లో అంతర్జాతీయ క్రికెట్ తో పాటు అన్ని రకాల క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. బ్రూస్ పైరౌడో మృతి పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.