సాధారణంగా తమ అభిమాన ఆటగాళ్లు గానీ, హీరోలు గానీ కనిపిస్తే.. అభిమానులు సెల్పీల కోసం ఎగబడటం సర్వసాధారణమే. తాజాగా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ చౌటుప్పల్ లో సందడి చేశాడు. దాంతో అతడిని చూసిన అభిమానులు సెల్పీల కోసం ఎగబడ్డారు. మరి ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం.
అతను భారత జట్టులో ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్ అయినా.. చెప్పుకోవడానికి పెద్దగా గణాంకాలు ఏమి లేవు. తెలుగు క్రికెటర్ కాకపోయినప్పటికీ అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. 2011 భారత్ ప్రపంచ కప్ జట్టులో అతడు సభ్యుడు. జట్టులో ఉన్నంతవరకు పర్వాలేదనిపించాడు. అతడెవరో కాదు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్.పి సింగ్. తాజాగా ఈ లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ చౌటుప్పల్ ల్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మరి ఆర్.పి సింగ్ తెలుగునాట ఎందుకు కనిపించాడంటే..
37 ఏళ్ళ ఆర్.పి సింగ్ ఉత్తర ప్రదేశ్ కి చెందినవాడు. 2006 లో పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలినాళ్లలో బాగానే రాణించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ఇదిలా ఉండగా.. ఈ భారత మాజీ పేస్ బౌలర్ చౌటుప్పల్ ల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చాడు. 2011 లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా.. మల్కాపురంలోని సుఖేర్ ఇండియా వెంచర్ యాజమాన్యం ఆటగాళ్లందరికి ఇళ్ల స్థలాలని బహుమతిగా ఇచ్చింది. ఆ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కి సంబంధించిన లావాదేవీల్లో భాగంగా ఆయన ఇక్కడకి వచ్చాడు. ఈ సమయంలో క్రికెట్ అభిమానులు అతడి చుట్టూ చేరి సందడి చేస్తూ కనిపించాడు. ఆర్.పి సింగ్ తో సెల్ఫీలు దిగడానికి పెద్ద క్యూనే కట్టారు.
ఇక ఆర్.పి సింగ్ టీంఇండియా తరపున 14 టెస్టులు, 58 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 40, వన్డేల్లో 68 వికెట్లు పడగొట్టాడు. అప్పట్లో భారత్ కి పేసర్ల కొరత ఉన్న సమయంలో ఆర్.పి సింగ్ పర్వాలేదనిపించాడు. గొప్ప గొప్ప దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం నా అదృష్టం అని ఇదివరకు తెలియజేశాడు. 2011 ప్లేయింగ్ 11 లో సభ్యుడిగా ఉండడం ఈ ఫాస్ట్ బౌలర్ కెరీర్ లో చెప్పుకోదగ్గ గొప్ప ఘనత. మరి ఆర్.పి సింగ్ తెలుగు నాట కనిపించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.