ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరగలేదంటూ.. ఓ మాజీ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 24 గంటల పాటు నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు. 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహారదీక్షకు దిగాడు.
“ప్రస్తుతం శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు కుటుంబాలకు న్యాయం చేకూరేందుకే తాను నిరాహారదీక్షకు దిగినట్లు దమ్మిక ప్రసాద్ తెలిపాడు. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేవరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దీంతో పాటు లంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని” మీడియాకు తెలిపాడు. దీంతోపాటు అంతకముందు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటరియట్ ఎదుట ఆందోళన చేస్తున్న లంక ప్రజలకు మద్దతుగా దమ్మిక ప్రసాద్ తన నిరసనను వ్యక్తం చేశాడు.
Former cricketer Dhammika Prasad who is on a 24 hour hunger strike at the Galle Face Green demanding justice for the victims of Easter Sunday bombings was joined by former cricket captain Arjuna Ranatunga. pic.twitter.com/JqagGyfbfA
— Rex Clementine (@RexClementine) April 15, 2022
ఇది కూడా చదవండి: ప్రయాణికుడి సెల్‌ఫోన్‌నుంచి మంటలు.. విమానంలో కలకలం
మరోవైపు.. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. దేశం దాదాపుగా దివాళా తీసిందని.. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టే పరిస్థితి ఎదురయ్యిందని ఆ దేశ ఆర్థిక శాఖ ఒక ప్రకటన లో పేర్కొంది. విదేశాల నుంచి అప్పుగా తీసుకున్న.. సుమారు 51 బిలియన్ డాలర్ల అప్పులను కట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు శ్రీ లంక ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
దేశమంతా అదే డిమాండ్
రాజపక్సే కుటుంబం పదవులను వీడాలంటూ శ్రీలంకలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల వద్ద, దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకునే వీలు లేకపోవడంతో వరుసల్లో నిలబడ్డ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది.
Galle Face protest, today at 5.50 PM.
Via : Rajith Keerthi Tennakoon#SriLanka pic.twitter.com/qqlvvLqLYM
— Kavinthan (@Kavinthans) April 15, 2022
Galle Face area tonight!
Pic – Social Media#SriLankaProtests #SriLanka pic.twitter.com/SGO2zWx8sI
— Jamila Husain (@Jamz5251) April 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.