తొలి రెండు టెస్టుల్లో స్పిన్ మాయాజాలంతో ఆసీస్ పతనాన్ని శాసించిన భారత్, మూడో టెస్టులో ఆదే స్పిన్ ఆడలేక కళ్లు తేలేశారు. ఆసీస్ స్పిన్ త్రయం మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీలను ఎదుర్కోలేక మ్యాచునే అప్పగించారు. ఆనాటి నుండి ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కంటే అత్యధికంగా చర్చ జరుగుతున్నది పిచ్‌ల మీదనే. నాగ్‌పూర్, ఢిల్లీతో పాటు ఇటీవలే ముగిసిన ఇండోర్ పిచ్ మీద జరగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇంకా మొదలుకాని అహ్మదాబాద్ పిచ్ గురించి కూడా శూల శోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశంలో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లకు ఆద్యం పోసింది.. తయారుచేయమని చెప్పింది మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అని మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి అందరికి విదితమే. ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా, 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా పుంజుకొని మూడో టెస్టులో నెగ్గడంతో సిరీస్ సీరియస్‌గా మారింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే చివరి టెస్టుపై ఆసక్తి కూడా పెరిగింది. అయితే, ఇండోర్ వేదికగా జరిగిన టెస్టు పిచ్‌కు ఐసీసీ ‘పూర్ రేటింగ్’ ఇవ్వడంతో భారత పిచ్‌లపై తీవ్ర చర్చ జరుగుతోంది. భారత్, స్వదేశీ పిచ్‌లను తనకు అనుకూలంగా మలుచుకుందంటూ క్రీడా పండితులు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.
తొలి రెండు టెస్టుల్లో స్పిన్ మాయాజాలంతో ఆసీస్ పతనాన్ని శాసించిన భారత్, మూడో టెస్టులో ఆదే స్పిన్ ఆడలేక కళ్లు తేలేశారు. ఆసీస్ స్పిన్ త్రయం మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీలను ఎదుర్కోలేక మ్యాచునే అప్పగించారు. ఆనాటి నుండి ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కంటే అత్యధికంగా చర్చ జరుగుతున్నది పిచ్‌ల మీదనే. నాగ్‌పూర్, ఢిల్లీతో పాటు ఇటీవలే ముగిసిన ఇండోర్ పిచ్ మీద జరగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇంకా మొదలుకాని అహ్మదాబాద్ పిచ్ గురించి కూడా శూల శోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశంలో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లకు ఆద్యం పోసింది.. తయారుచేయమని చెప్పింది మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అని మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Pitch for 3rd Test between India vs Australia. pic.twitter.com/I91HxQ7s8b
— Johns. (@CricCrazyJohns) February 27, 2023
భారత్ ఉపఖండంలో పిచ్‌ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దల్జీత్ సింగ్ గురించే. ఆయన బీసీసీఐ ఆలిండియా గ్రౌండ్ అండ్ పిచ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న సమయంలోనే భారత్ లోని చాలా వేదికల్లో స్పిన్, ఫాస్ట్, బౌన్సీ పిచ్ లు తయారయ్యాయి. ఈ క్రమంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో పిచ్‌ల గురించి తీవ్ర చర్చ జరుగుతుండటంతో ఆయన స్పందించారు. ధోనీ భారత జట్టు పగ్గాలు చేపట్టాక.. భారత్ లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లను తయారుచేయమని అడిగాడని.. ఆనాటి నుండి నాలుగు, ఐదు రోజుల్లో ఫలితం రావాల్సిన టెస్టు మ్యాచ్ లు మూడు రోజులకే ముగుస్తున్నాయని తెలిపాడు.
Australia remain in the dark about what pitch they will play on in the fourth Test in Ahmedabad with Indian curators having prepared two wickets.@ollycaffrey has the latest news from India: https://t.co/IFV0f3molT#INDvAUS
— AAP Sport (@AAPSport) March 8, 2023
ఇండియా.కామ్ అనే వెబ్‌సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన దల్జీత్ సింగ్.. “ధోని టెస్ట్ కెప్టెన్సీ చేపట్టడానికి ముందు మీరు ఇండియాలో జరిగిన టెస్టు మ్యాచులను గమనిస్తే అవి కనీసం నాలుగు రోజుల పాటు తప్పకుండా జరిగేవి. నాలుగో రోజు చివరి సెషన్ లో కానీ లేదా ఐదో రోజు కానీ ఫలితం వచ్చేవి. అప్పటి పిచ్‌ల మీద కాస్త గడ్డి, తేమ ఉండే విధంగా ఉండేవి. అవి తొలి మూడు రోజులు ఫాస్ట్ బౌలర్లకు, అనంతరం స్పిన్ కు సహకరించేవి. కానీ ఎంఎస్ ధోని సారథిగా నియమితుడయ్యాక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లను తయారుచేయాలని నాకు చెప్పాడు”.
“స్పిన్ పిచ్‌లు అంటే భారత ఆటగాళ్లకు చాలా ఇష్టమని ధోనీ చాలా సార్లు నాతో అన్నాడు. అప్పటి నుంచి మేం దేశవ్యాప్తంగా అలాంటి పిచ్ లనే తయారుచేయడం మొదలు పెట్టాం.. తయారుచేశాం..” అని దల్జిత్ సింగ్ తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న చాలా పిచ్‌లను రెండు రకాల మట్టితో తయారుచేశామని.. అందులో కొన్ని నల్లమట్టితో తయారుచేస్తే మరికొన్ని ఎర్రమట్టితో తయారు ఆయన తెలిపారు. నల్లమట్టిని ఒడిశా నుంచి.. ఎర్రమట్టిని.. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చే వారిమని..” వివరించారు. ప్రస్తుతం దల్జిత్ సింగ్ వ్యాఖ్యలు మరింత అగ్గిని రాజేస్తున్నాయి. స్వదేశీ మ్యాచుల పిచ్‌లు ఆయా దేశాల ఇష్టమని.. దీనికి ఒక ఆటగాడిని భాద్యుడిని చేయడం సరికాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంలోకి ధోనీని లాగడం.. సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indiacom exclusive #MSDhoni Started The Trend Of Spin-Friendly Pitches: Former Pitch Curator #DaljitSingh @msdhoni #INDvsAUS #IndiaVsAustralia https://t.co/nBFhKiTxai
— India.com (@indiacom) March 7, 2023