పాకిస్థాన్ కి సంబంధించిన క్రికెట్ ఆటగాడు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో లండన్ లో చికిత్స చేయించుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా కూడా రావడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించిన వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
అబ్బాస్ కు న్యూమోనియా కూడా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు డయాలిసిస్ తో పాటు కరోనా చికిత్స కూడా అందిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన త్వరగా కోలుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించాడు. 1969లో న్యూజిలాండ్‌పై టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన ఆయన 1985 వరకు కొనసాగారు. అబ్బాస్ వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు చేసి మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశారు.
క్రికెట్ రిటైర్మెంట్ అయిన తర్వాత అబ్బాస్ కొంత కాలం రిఫరీగా, ఐసీసీ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. అంతేకాదు ఆయన భారత్ కి చెందిన లూతరాని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జహీర్ అబ్బాస్ ఆరోగ్యంగా ఇంటికి తిరిగిరావాలని కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Wishing speedy recovery & complete health to Zaheer Abbas sb. Get well soon. Aameen 🤲🏼 https://t.co/ld5VH2nj7f
— Mohammad Hafeez (@MHafeez22) June 21, 2022