ప్రపంచ క్రీడా లోకంలో విషాదం నెలకొంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముర్రే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. న్యూజిలాండ్ తొలి టెస్ట్ విజయంలో బ్రూస్ కీలక పాత్ర పోషించాడు.
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఓపెనర్ బ్రూస్ ముర్రే మంగళవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వెల్లింగ్టన్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు ముర్రే. మంగళవారం ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ముర్రే మరణించారు. ఇక 1968లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముర్రే.. కివీస్ కు తొలి టెస్ట్ విజయం అందించడంలో కీలక ప్రాత్ర పోషించాడు. 1969లో పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. కివీస్ కు ఇదే తొలి టెస్ట్ విజయం కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచి న్యూజిలాండ్ కు విజయాన్ని అందించాడు. ఇక న్యూజిలాండ్ తరపున కేవలం 13 టెస్టులు మాత్రమే ఆడాడు. 5 అర్ధశతకాలతో.. 29.9 సగటుతో 598 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో మాత్రం అద్భుతంగా రాణించాడు ముర్రే. వెల్లింగ్టన్ తరపున 102 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన బ్రూస్ ముర్రే 6257 పరుగులు సాధించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టులో కీలకంగా రాణిస్తున్న అమేలియా కెర్, జెస్ కెర్ లు బ్రూస్ మనవరాళ్లు కావడం గమనార్హం.
We are deeply saddened to learn of of the passing of former Test Cricketer Bruce Murray earlier today. Our thoughts are with his family and friends in particular his daughter Jo our wonderful PDM and his grand daughters, current White Ferns Jess and Amelia Kerr. pic.twitter.com/2VicXH1eWD
— NZCPA (@NZCPA) January 10, 2023
We’re deeply saddened to note the passing of former Test batter and educator Bruce Murray, aged 82. “Bags” (as he was known) played 13 Tests between 1968 and 71, averaging 23.92. He was the grandad of WHITE FERNS Amelia and Jess Kerr. Our thoughts are with his family and friends. pic.twitter.com/GKQlcwyiyQ
— WHITE FERNS (@WHITE_FERNS) January 10, 2023