2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని.. తొలినాళ్లలో తన ధనా ధన్ బ్యాటింగ్ స్టైల్ తో ఎంతో మంది అభిమానులకు దగ్గరయ్యాడు. ఇక తన హెయిర్ స్టయిల్(జులపాల జుట్టు) గురుంచి చెప్పక్కర్లేదు. గల్లీకొక ధోని అన్నట్లుగా హెయిర్ స్టయిల్ ఫేమస్ అయ్యింది. బ్యాటర్ గానే కాకుండా.. కీపర్ గా, కెప్టెన్ గా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ధోని. అయితే.. పైకి కూల్ గా కనిపించే ధోనిలో మరో కోణం ఉందని తెరమీదకు వస్తోంది.
ఐపీఎల్‌లో ధోని అంటే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. ఇది మాత్రమే అందరకి గుర్తుండే విషయం. కానీ,.. చెన్నైపై నిషేధం పడిన రెండేళ్లు (2016, 2017).. ధోనీ.. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. 2016 సీజన్‌లో ధోని కెప్టెన్సీలో పూణే సూపర్‌జెయింట్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. దీంతో 2017 సీజన్‌లో దీనిని కెప్టెన్సీ నుంచి తప్పించి.. స్టీవ్ స్మిత్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించింది పూణే యాజమాన్యం. అయితే.. స్టీవ్ స్మిత్ పేరుకు మాత్రమే కెప్టెన్ అని.. ధోనీయే జట్టును నడిపించేవాడనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ సమయంలో పూణే సూపర్‌జెయింట్స్ కోచ్ గా పనిచేసిన ప్రసన్న అఘోరామ్, ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇది కూడా చదవండి: గతేడాది జట్టులో చోటే లేదు! ఇప్పుడు ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు
“ఐపీఎల్ 2016లో ఎమ్మెస్ ధోనీతో కలిసి పనిచేసే అవకాశం దొరికినప్పుడు చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. అప్పటికే మాహీ గురించి చాలా విన్నాను. ఆయన విజయాలను చూశాను. మొదటిసారి పూణే స్టేడియంలో మాహీని కలిసినప్పుడు.. నన్ను చూసి ఫిల్డర్ కాఫీ తాగుతారా అని అడిగాడు. నేను సరే అన్నాను. అక్కడున్న వారిని పిలిచి కాఫీ తేవాలని చెప్పాడు. తర్వాత నాతో. ‘‘చూడండి, మీకు చాలా అనుభవం ఉంది. కోచ్ ఫ్లెమ్మింగ్ మిమ్మల్ని సెలక్ట్ చేశారు. మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్న ప్రణాళికలు, వ్యూహ్యాలు అన్నీ ప్లేయర్లకు ఇవ్వండి. స్ట్రాటెజీ మీటింగ్స్ తీసుకోండి. కానీ నేను మీటింగ్‌కి రావాలని పిలవకండి. మరీముఖ్యంగా నేను అడగనిదే, ఏ సలహాలు ఇవ్వకండి. అయితే మీరిచ్చే సలహాలు, సూచనలన్నీ నాకు మెయిల్‌లో పంపించండి’’. అని చెప్పుకొచ్చాడు.
#RisingPuneSupergiants Removes MS Dhoni As Captain. Australia’s Steven Smith To Be New Captain. 2 Min Of Silence For #RPS.#IPL10 #IPL2017 pic.twitter.com/Vyy8x2a2Fd
— Sir Jadeja fan (@SirJadeja) February 19, 2017
ఇది కూడా చదవండి: IPL 2022: CSK vs KKR మళ్లీ ఆరెంజ్ గ్లోవ్స్‌తో ధోనీ.. కారణం అదేనా?
“ఆ సమయంలో ధోని మాటలను విని నేను షాక్ అయ్యా. ఎంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయితే మాత్రం నేను మీటింగ్స్‌కి రాను, నాకు సలహాలు ఇవ్వకండి అని అనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంత పొగరు.. అని మనసులో అనుకున్నా..’ అంటూ కామెంట్ చేశాడు ప్రసన్న అఘోరామ్. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌తో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కి స్ట్రాటెజిక్ కోచ్‌గా పనిచేసిన ప్రసన్న, సౌతాఫ్రికా జట్టుకి కోచ్‌గా పనిచేశారు.
IPL 2017: How Rising Pune Supergiant made the final https://t.co/8Vcqrb4NDw via @TOISports pic.twitter.com/H4kSfGAhBS
— The Times Of India (@timesofindia) May 20, 2017
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.