భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రిలో చేర్పించారట. అయితే సందీప్ పాటిల్ కు చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సందీప్ పాటిల్ కు రక్తనాళ్లలో రాళ్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు గురువారం అంజియోగ్రఫి చేయనున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న క్రికెట్ అభిమనులు సందీప్ పాటిల్ త్వరగా కొలుకుని ఆస్పత్రి నుంచి బయటకు రావాలని ప్రార్ధిస్తున్నారు.
1980లో పాకిస్తాన్ తో జరిగిన ఇంటర్ నేషనల్ మ్యాచ్ తో సందీప్ పాటిల్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి అనేక మ్యాచుల్లో ఆడిన సందీప్ పాటిల్ వేల పరుగులు సాధించాడు. సందీప్ పాటిల్ తన కెరీర్ లో 29 టెస్టులు, 45 వన్డేలో ఆడి తన ఆట తీరును కనబరిచారు. సందీప్ పాటిల్ ఒక ఆటగాడి గానే కాకుండా 2009లో వచ్చిన అనధికారిక ఇండియన్ క్రికెట్ లీగ్ లో ముంబై ఛాంప్స్ కు కోచ్ గా వ్యవహరించాడు. ఇక తన కెరీర్ ను ఇంతటితో ముగించకుండా నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా, 2012 బీసీసీఐ సెలక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా కూడా సందీప్ పాటిల్ వ్యవహరించడం విశేషం. అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సందీప్ పాటిల్ త్వరలో ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.