భారత మాజీ క్రికెటర్, సన్ రైజర్స్ మాజీ ప్లేయర్.. నమన్ ఓజా తండ్రి వీకే ఓజాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడి.. పరారీలో ఉన్న అతడిని అరెస్టు చేసి కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులందరినీ ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత, వీకే ఓజాను సోమవారం స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా, అతడిని ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించారు. ప్రసుత్తం పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
ఈ కేసు.. 2013లో బేతుల్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జౌల్‌ఖెడా బ్రాంచ్‌లో వీకే ఓజా మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన మోసానికి సంబంధించినది. బ్రాంచ్‌లో 34 నకిలీ ఖాతాలను తెరిచి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా సుమారు రూ.1.25 కోట్ల రుణాన్ని బదిలీ చేశారనే ఆరోపణలపై అప్పటి బ్యాంక్ మేనేజర్ రితేష్ చతుర్వేది 2014లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీకే ఓజాపై ముల్తాయ్ పోలీసులు.. జూన్ 19, 2014న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. అప్పటినుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
MP | In 2014, a case of alleged fund embezzlement in Bank of Maharashtra’s branch in Betul was registered. The then bank manager VK Ojha, father of former Indian cricketer Naman Ojha, was arrested yesterday. All other accused were arrested earlier: Sunil Lata, Multai PS in-charge pic.twitter.com/eFzACsTP2s
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 7, 2022
ఇది కూడా చదవండి: Chahal: తాగిన మైకంలో నెహ్రా, చాహల్ రోడ్డుపై రచ్చ.. వైరల్ అవుతున్న వీడియో!
ఎంత టాలెంట్ ఉన్నా.. ఆ టాలెంట్‌కి తగ్గ గుర్తింపు అందుకు తగ్గ అవకాశాలు రావాలంటే అదృష్టం ఉండాల్సిందే. అలాంటి సత్తా ఉన్న సరైన గుర్తింపు పొందలేకపోయిన క్రికెటర్లలో నమన్ ఓజా ఒకడు. టీమిండియా తరుపున ఒక వన్డే, ఒక టెస్టు మ్యాచ్ ఆడిన నమాన్ ఓజా, రెండు టీ20 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో 7861 పరుగులు చేసిన ఓజా, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఒకడు. వికెట్ కీపర్‌గా 351 మందిని పెవిలియన్ చేర్చిన ఓజా, 146 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 9753 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఓజా.. 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆడుతూ డేవిడ్ వార్నర్‌తో కలిసి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఇదో రికార్డు భాగస్వామ్యం. చివరిగా 2018లో ఐపీఎల్ ఆడిన నమాన్ ఓజా, ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడిన నమన్ ఓజా.. గతేడాది క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు.
Another win. Another victory celebration. Watch how Naman Ojha gets the traditional #SRH cake facial. #OrangeArmy pic.twitter.com/eBGRuaMgmm
— SunRisers Hyderabad (@SunRisers) May 11, 2016