మాజీ క్రికెటర్లు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. మొన్నీమధ్య యువరాజ్‌సింగ్.. ఇషాంత్‌ను ఇమిటేట్ చేసి వైరల్ అయ్యాడు. ఇటీవల సెహ్వాగ్.. పవన్ కల్యాణ్ డైలాగ్‌తో ట్విట్టర్‌ని షేక్ చేశాడు. ఇప్పుడు ఆ కోవలోకి మరో మాజీ క్రికెటర్ చేరాడు. మహ్మద్ కైఫ్.. ఆ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది చిరుతలా మైదానంలో కదులుతూ మెరుపు క్యాచ్‌లు, అద్భుత స్టంప్పింగ్స్. ఇప్పుడు ఇంకో టాలెంట్‌ను బయటపెట్టాడు ఈ దిగ్గజ క్రికెటర్. మహేశ్ బాబు మాస్ డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు గురించి ప్రస్తావించగా.. నాకు కూడా తెలుసు మహేశ్‌బాబు చాలా పెద్ద స్టార్. నేను చాలా సార్లు అతని గురించి విన్నాను అని చెప్పుకొచ్చాడు మహ్మద్ కైఫ్. ఆ క్రమంలో దూకుడు సినిమా నుంచి హోస్ట్ ఓ డైలాగ్ చెప్పి కైఫ్‌ను చెప్పమన్నాడు. కైఫ్ ఏ మాత్రం తడుముకోకుండా చాలా చక్కగా ఆ డైలాగ్‌ను రిపీట్ చేశాడు. మరి, ఆ డైలాగ్ ఏంటో మీరూ చూసేయండి.
Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu 🔥🌟
“MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA “⚡💥 pic.twitter.com/TCLx62N3kb
— ꓷ A Я K 🦇 (@GothamHero_) September 8, 2021