భారతీయులు దేన్నైనా అభిమానించడం మెుదలు పెడితే చాలు అది వారికి దేవుని తో సమానం అన్నట్లు చూస్తారు. అలాగే భారతీయులకు క్రికెట్ అన్నా.. క్రీడా కారులన్నా ఎనలేని అభిమానం. అందుకు తగ్గట్టు గానే వారి గురించి తెలుసుకునేందుకు ఆరటపడుతూ ఉంటారు. అదీ కాక వారికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఓ మాజీ స్టార్ క్రికెటర్ తన ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోకి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వెంకటేశ్ ప్రసాద్.. 90వ దశకంలో భారతీయ క్రీడా అభిమానులకు సుపరిచితుడు. ఇక పాక్ బ్యాటర్ అమీర్ సోహైల్ కు అయితే ఇప్పటికీ కలలోకి వస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 1996 లో భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో పాక్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ అమీర్ సోహైల్ కు వెంకటేశ్ ప్రసాద్ కు మధ్య మాటల యుద్ధం అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది.
ఆ మ్యచ్ లో అమీర్ ఓ బంతిని బౌండరీకి తరలించి.. ప్రసాద్ ను చూస్తూ..” ఇక నుంచి ప్రతీ బంతి అక్కడికే వెళ్తుంది” అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో రెచ్చిపోయిన వెంకటేశ్ ప్రసాద్ తన నెక్ట్స్ బాల్ కే అమీర్ ను క్లీన్ బౌల్డ్ చేస్తాడు. ”ఇక నువ్వు వెళ్లాల్సింది అటు అంటూ పాకిస్తాన్ డగౌట్ ను చూపిస్తూ ప్రసాద్ తన విజయాన్ని సెలబ్రెట్ చేసుకున్నడు. ఈ వీడియో ఇప్పుడు చూసినా క్రీడా అభిమానుల మనసు ఉప్పోంగుతుంది.
అయితే వెంకటేశ్ ప్రసాద్ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫోటోను షేర్ చేశాడు. దాంట్లో అతడు చాలా బక్కగా కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూసిన అభిమానులు సర్ ఏమైంది.. ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నల పై స్పందిస్తూ.. ” నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అరుణాచల్ ప్రదేశ్ పర్వతాలలోని గిరివలంలో సాధనలో ఉండటం వల్ల లైట్ ఫుడ్ తిసుకుంటున్నాను. అందుకే కొద్దిగా బరువును కోల్పోయా. త్వరలోనే మళ్లీ పాత వెంకటేశ్ ప్రసాద్ ను చూస్తారు. మీ అభిమానానికి చాలా థ్యాక్స్” అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ ఫొటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I am absolutely fine and in the best of health.
Was on a Sadhana and had done Girivalam in Tiruvanamalai around Arunachala mountain and was on a very light diet. Have lost some weight but feel very energetic and alive. Will regain weight soon. Thank you v much for your concern. https://t.co/p5SVbrXpBK— Venkatesh Prasad (@venkateshprasad) August 16, 2022