ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు మరొక దేశానికి ఆడటం సహజమే. ఇలాంటి ఘటనలు అన్ని క్రీడల్లో ఉన్న వారి ప్రతిభ వెలుగులోకి వచ్చినప్పుడు వారి గురుంచి చర్చలు మొదలవుతాయి. అయితే, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఇంగ్లాండ్ జట్టుకు ప్రతినిత్యం వహించారు.. వహిస్తున్నారు కూడాను. అందులో మాజీ వెటరన్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, ప్రస్తుత ఇంగ్లాడ్ సారధి ఇయాన్ మోర్గాన్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. ఇలా చాలామందే ఉన్నారు. వీరందరు విదేశాలకు చెందినవారే. అయితే వలసలు, అవకాశాలు రాకపోవడం వంటి కారణాల రీత్యా ఇంగ్లాండ్ తరుపున ఆడుతున్నారు.
ఇదిలావుంటే ఇంగ్లాండ్‌కు ఆడిన ఒక క్రికెటర్.. జింబాబ్వే తరుపున బరిలోకి దిగాడు. అతగాడి పేరు.. గ్యారీ బ్యాలెన్స్. ఇతడు పుట్టింది జింబాబ్వేలో అయినా పెరిగింది మాత్రం ఇంగ్లాండులో.. బ్యాలెన్స్ చిన్న తనంలోనే అతడి తల్లిదండ్రలు ఇంగ్లాండ్‌లో స్ధిర పడ్డారు. దీంతో అతడు ఇంగ్లీష్ జట్టు తరపున 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 23 టెస్టులు, 16 వన్డేల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక కౌంటీ మ్యాచులు అయితే లెక్కేలేదు. యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ తరుపున ఎన్నో మ్యాచులు ఆడాడు. అయితే, ఇటీవల బ్యాలన్స్ తన సొంత దేశం జింబాబ్వే తరపున ఆడాలని నిర్ణయించుకోవడం, అందుకు యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి.
Former England and Yorkshire batter Gary Ballance is returning to Zimbabwe to play for the country of his birth 🇿🇼
His last Test for England came in July 2017, making him eligible to play for Zimbabwe straight away pic.twitter.com/ynp7kSWIj4
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2022
ఇంకేముంది రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడి.. అందులో మంచి ప్రతిభ కనబరిస్తే జాతీయ జట్టులోకి రావడం ఖాయమనుకున్నారు అందరు. అయితే, బ్యాలెన్స్ అనూహ్యంగా దేశవాళీ క్రికెట్ ఆడకుండానే జింబాబ్వే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతోన్న టీ20, వన్డే సిరీస్‌లో ఆడేందుకు అతనికి అవకాశం కల్పించారు.. సెలెక్టర్లు. ఇప్పటికే టీ20, వన్డే జట్టులో చోటు దక్కించుకున్న బ్యాలెన్స్ ఆడిన మూడు మ్యాచుల్లో 30(టీ20), 23(వన్డే), 52(వన్డే) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ వంటి టాప్ జట్టును వదులుకొని సొంత దేశానికి అడాలని నిర్ణయించుకోవడం పట్ల బ్యాలెన్స్ పై.. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#2ndODI – FIFTY! Third ODI half-century for ex-England batsman Gary Ballance and his first for 🇿🇼! 👏
📝 Scorecard: https://t.co/1hF7Pg1kuZ
📺 https://t.co/oaXVeevymn#ZIMvIRE | #VisitZimbabwe | #FillUpHarareSportsClub pic.twitter.com/Z6BRoP02jm— Zimbabwe Cricket (@ZimCricketv) January 21, 2023