7 మ్యాచుల టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ వచ్చిన ఇంగ్లాండ్ జట్టు 4-3 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. గడాఫీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో పర్యాటక జట్టు 67 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 209 పరుగుల భారీ స్కోర్ చేయగా.. పాక్ జట్టు 142 పరుగులకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటర్లపై తీవ్ర విమర్శలోస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి వసీం అక్రమ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘బ్యాటర్లను ఉద్దేశిస్తూ.. 360 డిగ్రీల ఆట మీ వల్ల కాదుగానీ కనీసం అందులో సగం.. అంటే 180 డిగ్రీల ఆట అయినా ఆడగలరా..? అని ప్రశ్నలు సంధించాడు.
పాకిస్తాన్ జట్టుకున్న బ్యాటింగ్, బౌలింగ్ ను పరిశీలిస్తే.. ఆ జట్టును స్వదేశంలో కాదు కదా! విదేశాల్లోనూ ఓడించడం కష్టం. అలాంటి జట్టు పర్యాటక జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఎన్నో ఏళ్ల తరువాత స్వదేశంలో మ్యాచులు జరగడం, అందులోనూ సిరీస్ ఓడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు అన్న తేడా లేకుండా సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి వసీం అక్రమ్ కూడా రంగంలోకి దిగాడు. పదే పదే విఫలమవుతున్న పాక్ మిడిలార్డర్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు.
After England won the series by 4-3 against Pakistan 😅#PAKvENG pic.twitter.com/Wci6TTbV60
— RVCJ Media (@RVCJ_FB) October 3, 2022
“మీరు 360 డిగ్రీల ఆట ఆడమని నేను కోరడం లేదు. అలా అడగడం మీనుంచి అత్యాశే అవుతుంది. కనీసం 180 డిగ్రీల ఆటైనా ఆడండి. నెట్స్ లో ఏ షాట్స్ ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేస్తున్నారా..? ఒకవేళ అలా చేస్తే దానిని మ్యాచులో ఎందుకు అమలుచేయడం లేదు..?” అంటూ ఛలోక్తులు విసిరాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ ను చూడండి. టీ20 ఆటకు అతడు చక్కటి ఉదాహరణ. పేసర్లను ఎంత ధీటుగా ఎదుర్కుంటున్నాడో స్పిన్నర్లనూ అంతే ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఒకవేళ నేను ఇప్పుడు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆడినా మన బ్యాటర్లు ఎక్కడ షాట్లు కొడతారో ముందే అంచనా వేయగలుగుతా. అసలు పాకిస్తాన్ బ్యాటర్లలో ఏదైనా కొత్తరకమైన షాట్ ఆడదామన్న ధోరణి కనిపించడం లేదు..” అంటూ గట్టిగానే హెచ్చరికలు పంపాడు. ఈ మాటలన్నీ టీమిండియా బ్యాటర్.. ‘సూర్య కుమార్ యాదవ్ ను ఉద్దేశిస్తూ అనడం గమనార్హం.
PAK v ENG 2022: “Forget 360, can they even play 180 degree?” – Wasim Akram asks Pakistan Batting Coach Mohammad Yousufhttps://t.co/66QZmHJACH
— Pakistan Timez (@PakistanTimez) October 2, 2022
కాగా, ఈ సిరీస్ లో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ తప్ప మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్, అసిఫ్ అలీ.. ఇలా పేపర్ పై బలంగా కనపడ్డ పాక్ జట్టు మైదానంలోకి దిగాక తేలిపోయింది. ఫలితంగా 7 మ్యాచుల టీ20 సిరీస్ ను 4-3 తేడాతో కోల్పోయింది. కాగా, ఆఖరి మ్యాచులో కుష్ దిల్ షా ఔట్ అయ్యాక.. “పార్చీ.. పార్చీ..” అంటూ అభిమానులు నినాదాలు కూడా చేశారు.
Pakistan middle order vs England middle order pic.twitter.com/g3cI6njshr
— shitposts only (@k3wlbwoyy) October 2, 2022