భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. చిట్టగాంగ్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో రోజు రెండో సెషన్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌కు ఆహ్వానించింది. టీమిండియా బ్యాటర్లలో పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86), అశ్విన్(58) పరుగులతో రాణించారు. అయితే తొలి ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ బాల్‌కే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్, తొలి బంతికే బంగ్లా ఓపెనర్ నజ్ముల్ షాంటోను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు.
ఆ వెంటనే నాలుగో ఓవర్‌లో ఉమేష్ యాదవ్ సైతం యాసిర్ అలీని అవుట్ చేసి.. బంగ్లాను దెబ్బతీశాడు. దీంతో 5 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వెంట వెంటనే రెండు వికెట్లు పడటంతో జాకిర్ హసన్‌తో కలిసి లిట్టన్ దాస్ బంగ్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 30 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన లిట్టన్ దాస్.. కాస్త అతి విశ్వాసం చూపించాడు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్న సమయంలో జట్టులోకి వచ్చిన మొహమ్మద్ సిరాజ్‌తోనే పెట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసేందుకు వచ్చిన సిరాజ్.. తొలి బంతిని పిచ్ ఆప్ డెలవరీగా వేశాడు. దాన్ని దిఫెన్స్ ఆడిన దాస్.. సిరాజ్‌తో ఏదో అన్నడు.
అసలే అగ్రెసివ్ కోహ్లీ అండర్‌లో షైన్ అయిన సిరాజ్ ఊరుకుంటాడా..? మాటకు మాట బదులిచ్చాడు. అంతటితో ఆగని లిట్టన్ దాస్.. ఏం చెబుతున్నావో వినిపించడంలేదంటూ.. తన చెవిపై చేయి పెట్టి సిరాజ్ వైపు వెళ్లాడు. అంపైర్ కలుగజేసుకుని లిట్టన్ దాస్‌ను వెనక్కి నెట్టాడు. లిట్టన్ దాస్ తన వైపుకు ఏదో ధారకారిలా వస్తున్నా.. బౌలింగ్ వేసేందుకు వెళ్లిపోయిన సిరాజ్ తర్వాత బంతితోనే అదరిపోయే సమాధానం ఇచ్చాడు. వీరిద్దరి మధ్య గొడవ జరిగిన నెక్ట్స్ బాల్‌కే లిట్టన్ దాస్ బౌల్డ్ అవుతాడు. వెంటనే విరాట్ కోహ్లీ పెవిలియన్ వైపు వెళ్తున్న లిట్టన్ దాస్‌ను చూస్తూ.. తన చెవిని చూపిస్తూ. ఏదో చెబుతున్నావ్ అంటూ సైగ చేశాడు. వెంటనే సిరాజ్ సైతం చెవి చూపించి.. దాస్‌కు కౌంటర్ ఇచ్చాడు.
సిరాజ్, విరాట్ కోహ్లీది డెడ్లీ కాంబినేషన్.. టెస్టు క్రికెట్‌లో ఇండియాకు నంబర్ వన్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ.. తన హయంలో సిరాజ్‌ను పులిని పెంచినట్లు పెంచాడు. తనకు వికెట్లు అవసరమైన సమయంలో సిరాజ్‌ను ఉసిగొలిపి వికెట్లు దక్కించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కోహ్లీ చెబితే లోయలోనైనా దూకేస్తాడు సిరాజ్. ఇలా వీరిద్దరి కాంబినేషన్ టెస్టు క్రికెట్‌లో హైలెట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్ కాకపోయినా.. అవసరమైతే సిరాజ్‌ను ముందుండి నడిపిస్తాడు. ఇదంతా తెలియని లిట్టన్ దాస్.. కోహ్లీ తమ్ముడితో పెట్టుకున్నాడు.. తగిన మూల్యం చెల్లించుకున్నాడు. నిన్నటి వరకు మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. ఇండియన్ ఫ్యాన్స్ మనసులో కూడా మంచి స్థానం సంపాదించుకున్న లిట్టన్ దాస్.. ఈ ఓవర్ యాక్షన్‌తో అంతా పొగొట్టుకున్నాడు. మరి దాస్ యాక్షన్.. కోహీ రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wicket;Siraj vs Litton Das 😎#INDvsBAN #BANvIND #siraj pic.twitter.com/WW1jGg5RwY
— Rahul Sisodia (@Sisodia19Rahul) December 15, 2022