భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF)పై గత కొన్ని రోజుల క్రితం నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య(FIFA) ప్రకటించింది. భారత ఫుట్ బాల్ సమాఖ్య పాలక వర్గంలో మూడవ పార్టీ తల దూరుస్తోందని ఇది క్రీడా సమాఖ్యాకి విరుద్దం అని ఫిఫా అప్పుడు పేర్కొంది. అయితే తాజాగా ఈ నిర్ణయం పై ఫిఫా వెనక్కి తగ్గింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత ఫుట్ బాల్ సంఘానికి భారీ ఊరట లభించింది. ఇండియా పై విధించిన నిషేధాన్నిఎత్తివేస్తున్నట్లు ఫిఫా ప్రకటించింది. తన నిర్ణయాన్ని అంతర్జాతీయ ఫుట్ బాల్ కౌన్సిల్ బ్యూరో తాజాగా వెల్లడించింది. దీనికి కారణాలను సైతం ఫిఫా వెల్లడించింది.” భారత ఫుట్ బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటీవ్ కమీటిని రద్దు చేసినట్లు మా దృష్టికి వచ్చింది.
అదీ కాక సమాఖ్య తమ రోజూవారి పనుల పై పరిపాలనా వర్గం పూర్తిగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. థర్డ్ పార్టీని తమ వ్యవహారాలలో తలదూర్చనీయకుండా వ్యవహరిస్తుండటంతో మేం ఈ నిర్ణయానికి వచ్చాం అని ఫిఫా వర్గాలు తెలిపాయి. ఇక నుంచి భారత ఫుట్ బాల్ లో జరిగే ప్రతీ విషయాన్ని మేం సమీక్షిస్తూ ఉంటామని పేర్కొంది. ఫుట్ బాల్ ఎన్నికల్లో తమ వంతు సహయం అందిస్తామని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 11 నుంచి ఇండియాలో జరగాల్సిన అండంర్ – 17 ఉమెన్స్ వరల్డ్ కప్ ను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఫిఫా తీసుకున్నఈ నిర్ణయంతో భారత ఫుట్ బాల్ సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. మరి ఫిఫా తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
FIFA lifts suspension of All India Football Federation
More here 👉 https://t.co/GV7VBP7TC9 pic.twitter.com/tfGdy9UrnK
— FIFA Media (@fifamedia) August 26, 2022