ఆల్ ఇండియా ఫుల్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) మంగళవారం ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల(థర్డ్ పార్టీ) ప్రమేయం ఉన్న కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫిఫా వెల్లడించింది. ఈ సెస్పెన్షన్ వేటు వెంటనే అమల్లోకి వస్తుంది వెల్లడించింది. భారత్‌పై వేటు వేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపింది.
తాజా నిర్ణయంతో ముగ్గురు సభ్యుల ఏఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఏఐఎఫ్ఎఫ్‌పై పాలక మండలి తిరిగి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఈ ఊహించని సస్పెన్షన్ వేటు కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా జరగాల్సిన అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ మన దేశం నుంచి తరలిపోయే ప్రమాదం ఉంది.
కాగా, ఏఐఎఫ్‌ఎఫ్ రాజ్యాంగాన్ని సవరించేందుకు అలాగే 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐఎఫ్‌ఎఫ్ ఎన్నికలను నిర్వహించేందుకు సుప్రీం కోర్టు ఈ ఏడాది మే నెలలో ఏఐఎఫ్‌ఎఫ్ పాలక మండలిని రద్దు చేసి ముగ్గురు సభ్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కాగా.. స్వతంత్ర దినోత్సవ జరిగిన మరుసటి రోజే ఒక అంతర్జాతీయ వేదికపై భారత్‌ను సస్పెన్షన్ వేటు వేయడం భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో అవమానంగా భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
FIFA bans India; takes away hosting rights of women’s under-17 World Cup @DhimanHT https://t.co/WEi5JVJzcf
— Hindustan Times (@HindustanTimes) August 16, 2022
ఇది కూడా చదవండి: దేశం పేరు మార్చండి! ప్రధాని మోదీకి షమీ మాజీ భార్య రిక్వెస్ట్