కొన్నిసార్లు బ్యాటర్ కి దురదృష్టం ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. ఊహించని విధంగా, తగలరాని చోట బంతి తగిలి నొప్పితో విలవిల్లాడిపోతాడు. తాజాగా ఓ బ్యాటర్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటర్లు చాలా బందో బస్త్ గా గ్రౌండ్ లోకి దిగుతారు. హెల్మెట్, గ్లవ్ ,ప్యాడ్, గార్డ్.. ఇలా దాదాపు శరీరమంతా కప్పేసుకొని చాలా జాగ్రతగా ఆడతారు. అయినా.. కొన్నిసార్లు బ్యాటర్ కి దురదృష్టం ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. ఊహించని విధంగా, కొన్ని సార్లు తగలరాని చోట బంతి తగిలి నొప్పితో విలవిల్లాడిపోతాడు. అయితే..బౌలర్ విసిరిన బంతి వలనే బ్యాటర్లకు చాలావరకు దెబ్బ తగిలే అవకాశముంది. కానీ ఫీల్డర్ బంతిని బలంగా విసరడంతో.. ఆ బంతి తగలరాని చోటతాకింది. దాంతో ఆ బ్యాటర్ చాలాసేపు నొప్పితో బాధపడ్డాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుతం యూరోపియన్ క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా బ్రదర్స్ ఎలెవెన్ వర్సెస్ ఇండియన్ రాయల్స్ మధ్య జరిగిన 10 ఓవర్ల మ్యాచ్ లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇండియన్ రాయల్స్ బ్యాటర్ షైకత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతిని మిడ్ ఆన్ దిశగా కొట్టాడు. ఈ క్రమంలో బ్యాటర్ వేగంగా ఒక పరుగు పూర్తి చేసుకోగా.. అదే సమయంలో ఫీల్డర్ మిస్ ఫీల్డింగ్ చేయడంతో రెండో పరుగు కోసం ప్రయత్నించారు. దీంతో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్ స్ట్రైకింగ్ వైపు బంతిని బలంగా విసిరాడు. అయితే పొరపాటున బంతి కాస్త నాన్ స్ట్రైక్ గ్రీజ్ లోకి వచ్చిన బ్యాటర్
షైకత్ పొట్ట కింది భాగంలో తగిలింది. బంతి బలంగా తగలడంతో బ్యాటర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు.ఈ దశలో కనీసం పక్కకు కూడా తిరగ లేకపోయాడు. అయితే సేఫ్ గార్డ్ ఉండడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సంఘటనతో నెటిజన్స్ కాస్త సరదాగా నవ్వుకున్నారు. అదే సమయంలో అతని కష్టం పగవాడికి కూడా రాకూడదనే కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే బ్రదర్స్ ఎలెవెన్ జట్టు ఈ మ్యాచులో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచులో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. ఇరు జట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో గోల్డెన్ బాల్ కి అవకాశమివ్వగా.. బ్రదర్ ఎలెవెన్ జట్టు గెలిచింది. మొత్తానికి ఆడియన్స్ కి కాస్త సరదాగా, కాస్త జాలిగా అనిపించినా ఈ సంఘటన మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Timeline cleanser. Sound on for maximum dopamine injection.
— Georgie Parker (@georgieparker) March 23, 2023