శ్రీలంక సంచలన స్పిన్నర్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. పట్టుమని 10 టెస్టులైనా ఆడకుండా ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు. మురళీధరన్, షేన్ వార్న్ లాంటి స్పిన్నర్లను సైతం వెనక్కి నెట్టాడు. ఇంతకీ ఎవరా స్పిన్నర్ ?
గాలే టెస్టులో రోజుకొక రికార్డ్ నమోదవుతుంది. శ్రీలంక, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగోరోజు ముగిసేసరికి 2 వికెట్ల 54 పరుగులు చేసిన ఐరీష్ టీమ్ ఈ రోజు శ్రీలంక స్పిన్నర్ల దాటికి చేతులెత్తేసింది. స్పిన్నర్లు రమేష్ మెండీస్, ప్రభాత్ జయసూరియా ఐర్లాండ్ పతనాన్ని శాసించారు. దీంతో శ్రీలంక ఈ సిరీస్ ను 2-0 తో వైట్ వాష్ చేసింది. డబల్ సెంచరీ చేసిన కుశాల్ మెండీస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. ప్రభాత్ జయసూరియాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. ఇక ఈ మ్యాచులో ఒక శ్రీలంక స్పిన్నర్ జయసూరియా ఒక ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.
శ్రీలంక సంచలన స్పిన్నర్ జయసూరియా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. పట్టుమని 10 టెస్టులైనా ఆడకుండా ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు.మురళీధరన్, షేన్ వార్న్ లాంటి స్పిన్నర్లను సైతం వెనక్కి నెట్టాడు.గత కొన్ని రోజులుగా తక్కువ టెస్టుల్లో 5 సార్లు 5వికెట్ల ఘనత అందుకున్న ఈ లెగ్ స్పిన్నర్.. ఇప్పుడు అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న స్పిన్నర్ గా రికార్డ్ సృష్టించాడు. 7 టెస్టు మ్యాచ్ లాడిన జయసూరియా 11 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్ బ్యాటర్ స్టిర్లింగ్ వికెట్ తీయడం ద్వారా ఈ క్లబ్ లోకి చేరాడు. ఓవరాల్ ఈ లిస్టులో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ టర్నర్ 6 టెస్టుల్లోనే 50 వికెట్లు తీసి అగ్ర స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత జయసూరియా.. దక్షిణాఫ్రికా సీమర్ ఫిలాండర్ తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరి ఇంత వేగంగా 50 వికెట్లు తీసి మురళీధరన్, షేన్ వార్న్ ని దాటిన ఈ శ్రీలంక స్పిన్నర్ మరిన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.