అర్షదీప్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. టీమిండియా ఓటమికి కారణమయ్యాడంటూ.. నెటిజన్లు అర్షదీప్ సింగ్‌ను నో బాల్ కింగ్‌గా పేర్కొంటూ.. ట్రోల్ చేస్తున్నాడు. గతంలో ఒక సారి క్యాచ్ డ్రా విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అర్షదీప్ సింగ్.. ఇటివల శ్రీలంకతో పుణే వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వరుసగా మూడు నో బాల్స్‌తో పాటు మొత్తం 5 నో బాల్స్ వేసి.. టీమిండియా ఓటమికి కారణం అయ్యాడు. మళ్లీ ఇప్పుడు తాజాగా శుక్రవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ.. చివరి ఓవర్‌లో ఒక నో బాల్‌తో పాటు మూడు సిక్సులు, ఒక ఫోర్‌తో మొత్తం 27 రన్స్ సమర్పించుకుని టీమిండియా ఓటమికి కారకుడిగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నో బాల్ కింగ్ మరో మ్యాచ్‌లో టీమిండియాను ఓడించాడంటూ.. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు అర్షదీప్ సింగ్‌పై ట్రోలింగ్‌కు దిగుతున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కానీ.. 19వ ఓవర్ ముగిసిన తర్వాత కూడా వారి స్కోర్.. 149 మాత్రమే. చివరి ఓవర్‌లో మరో 10 పరుగులు వచ్చినా.. మహా అయితే టీమిండియా ముందు 160 పరుగులు టార్గెట్ ఉంటుందని అంతా భావించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం అవే లెక్కలు వేసుకుని టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతోపాటు, 18వ ఓవర్, 20వ ఓవర్ అర్షదీప్ సింగ్‌కు ఇచ్చాడు. 18వ ఓవర్ అద్భుతంగా వేసిన అర్షదీప్.. చివరి ఓవర్‌లో మాత్రం.. తన వీక్‌నెస్‌ను బయటపెట్టుకున్నాడు. ఒత్తిడిలో నో బాల్స్ వేసే అలవాటు ఉన్న అర్షదీప్ సింగ్.. చివరి ఓవర్ తొలి బంతిని నో బాల్‌గా వేశాడు. ఆ బాల్‌ను డార్లీ మిచెల్ భారీ సిక్స్ బాదాడు. దీంతో కాన్ఫిడెన్స్ కోల్పోయిన అర్షదీప్ తర్వాతి రెండు బంతుల్లోనూ రెండు సిక్సులు సమర్పించుకున్నాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మూడు వరుస సిక్సులు ఒక ఫోర్, రెండు డబుల్స్‌తో మిచెల్ మొత్తం 27 పరుగులు పిండుకున్నాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యంత భారీగా పరుగులు వచ్చిన ఓవర్. 4 ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీసుకుని ఏకంగా 51 పరుగులు సమర్పించుకుని.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. చివరి ఓవర్‌లో అనూహ్యంగా 27 రన్స్ రావడంతో ఒక్కసారిగా మూమెంటమ్ న్యూజిలాండ్ వైపు వెళ్లింది. అదే ఊపులో కివీస్ బౌలర్లు చెలరేగిపోయి.. భారత టాపార్డర్‌ను కుప్పకూల్చారు. 15 పరుగులకే 3 వికెట్లు తీయడంతో భారత కోలుకోలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ 47, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో పోరాడినా.. భారత్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే.. అర్షదీప్ సింగ్ చివరి ఓవర్‌లో కాస్త తక్కువగా పరుగులు ఇచ్చ ఉంటే.. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండేదని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Contrasting fortunes for Arshdeep Singh.#ArshdeepSingh #India #INDvsNZ #Cricket #T20Is pic.twitter.com/qDG8YwR0Yh
— Wisden India (@WisdenIndia) January 27, 2023