ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా మొదలై.. ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు పూర్తయ్యాయి. కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్- లక్నో సూపర్ జైంట్స్ సైతం తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గత సీజన్ టేబుల్ లీస్ట్ పొజిషన్ కే పరిమితమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. సీజన్ ప్రారంభానికి ముందే అనేక కారణాల రీత్యా అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆటతోనైనా విమర్శకులకు సమాధానం చెబుతారని కొందరు ఆశించారు. కానీ, హైదరాబాద్ మాత్రం అదే పేలవ ప్రదర్శనను కొనసాగించింది.
ఇదీ చదవండి: అంపైర్ తప్పిదమే SRH కొంప ముంచింది! ఫ్యాన్స్ ఫైర్!
సీజన్ మొదటి మ్యాచ్ లోనే రాజస్థాన్ పై ఘోర పరాభవాన్ని చవిచూసింది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ అంతా రాజస్థాన్ బౌలర్ల ముందు తేలిపోయింది. ముగ్గురు మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదంటే అర్థం చేసుకోవాలి. మార్కరమ్(57), వాషింగ్టన్ సుందర్(40) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోయారు. ముఖ్యంగా యాజమాన్యం, అభిమానులు ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఘోరంగా విఫలమయ్యాడు. 9 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ గా పెవిలియన్ చేరాడు. పూరన్ విషయంలో సన్ రైజర్స్ జట్టు, కావ్య పాప మరీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.అయితే సీజన్ లో ఒక్క మ్యాచ్ చూసి ఆ నిర్ణయానికి ఎలా వస్తారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్ లో పూరన్ ఎప్పుడూ పెద్దగా ఆకట్టుకోలేదని కొందరు గణాంకాలు కూడా చూపిస్తున్నారు. గత సీజన్ చూసుకుంటే పంజాబ్ తరఫున 7.72 బ్యాటింగ్ యావరేజ్ తో 85 పరుగులు చేశాడు. నిన్న రాజస్థాన్ పై మ్యాచ్ తో కలుపుకుని ఐపీఎల్ లో పూరన్ గత 7 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 0, 0, 9, 0, 19, 0, 0.. మొత్తం 42 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఐదుసార్లు డకౌట్ గా పెవిలియన్ చేరాడు.
ఇదీ చదవండి: SRH టీమ్ పై రాజస్థాన్ రాయల్స్ సెటైరికల్ పోస్ట్!
పూరన్ 2019లో ఐపీఎల్ ఆడటం మొదలు పెట్టాడు. 2019, 2020, 2021 మూడేళ్లు పంజాబ్ టీమ్ తరఫున ఆడాడు. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు పూరన్ ను రూ.10.75 కోట్లతో కొనుగోలు చేసింది. ఇప్పటివరకు పూరన్ ఐపీఎల్ 34 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 32 ఇన్నింగ్స్ లో 151.50 స్ట్రైక్ రేట్, 21.64 బ్యాటింగ్ యావరేజ్ తో 606 పరుగులు చేశాడు. వాటిలో రెండు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పూరన్ పై ఆశలు పెట్టుకున్న SRH టీమ్- కావ్యపాపపై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. నికోలస్ పూరన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.