కోహ్లీ, రోహిత్ శర్మ ఈ పేర్లు వినగానే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిద్ది అని బయట గట్టిగానే టాక్ వచ్చింది.. తెచ్చారు కూడా. వారి మధ్య దాదాపు రెండేళ్లుగా గొడవలు ఉన్నాయని అభిమానులు కూడా బాగానే నమ్మారు. అప్పుడు జరిగిన సంఘటనలు కూడా వాటికి ఆర్జం పోశాయి. 2019 వన్డే ప్రపంచకప్ జట్టు ఎంపికలో వీరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత రోహిత్ అతని భార్య కోహ్లీని ఇన్‌స్టాలో అన్ ఫాలో కొట్టడం, అనుష్క శర్మ తర్వాత రోహిత్‌ని అన్ ఫాలో చేయడం వంటి ఘటనలు వార్తలకు ఊతమిచ్చాయి. రోహిత్ శర్మ కారణంగానే కోహ్లీ టీ20 కెప్టెన్సీ కోల్పోతున్నాడని కొందరు, రోహిత్ వైస్ కెప్టెన్‌గా తొలగించాలని కోహ్లీ బీసీసీఐని కోరినట్లు మరికొందరు పుకార్లు పుట్టించారు. కాగా, ఆదివారం ఆర్సీబీ– ముంబయి మ్యాచ్ సందర్భంగా రోహిత్- కోహ్లీ మీద వచ్చినవన్నీ పుకార్లే అంటూ నిరూపించేలా ఓ ఘటన ఆవిష్కృతమైంది. మ్యాచ్‌లో గాయబడిన రోహిత్ శర్మను కోహ్లీ ముంబయి ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ప్రత్యేకంగా కలిశాడు. కోహ్లీని చూసి రోహిత్ శర్మ లేచి నుంచుని నవ్వుతు పలకరించాడు. గాయం గురించి విరాట్ కోహ్లీ ఆరా తీశాడు. ఇప్పుడు ఆ ఫొటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు పిచ్చ హ్యాపీ అయిపోతున్నారు. మ్యాచ్ సంగతి పక్కన పెడితే ఇద్దరు దిగ్గజాలు ఓకే ఫ్రేమ్‌లో కనిపించడం.. నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీ20 వరల్డ్ కప్‌కు ముందే వారి మధ్య విభేదాలు లేవని క్లారిటీ రావడం కూడా ఒకందుకు మంచిదే అంటూ చెప్పుకుంటున్నారు.
Win or lose but these moments is made my morning beautiful #Rohirat #ViratKohli #RohitSharma pic.twitter.com/P2jUlM3Clv
— Maulik Vadariya (@MaulikVadariya) September 27, 2021