కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులతో సౌతాఫ్రికా వణికిపోతుంది. ఇప్పటికే అక్కడ కరోనా కేసులు ఐదు రెట్లు పెరిగాయి. కరోనా ఫోర్త్‌వేవ్‌తో సౌతాఫ్రికా ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరి కరోనా సోకుతోంది. ఈ పరిస్థితిపై ఆ దేశ అధ్యక్షుడు సిరల్ రామఫోసా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సౌతాఫ్రికాతో సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని, ఈ సిరీస్ నిర్వహణ ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
ఈ నెల 26 నుంచి సౌతాఫ్రికాతో భారత్ 3 టెస్టులు, 3 వన్డేలు ఆడాల్సి ఉంది. కానీ అక్కడ కరోనా విలయతాండవం చేస్తుండడంతో సిరీస్ జరగడంపై మొదట్లో నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ బీసీసీఐ అధికారులు సిరీస్ నిర్వహించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఈ సిరీస్ నిర్వహించడం అంత అవసరమా అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల నుంచి తలెత్తుతున్నాయి. ఈ సిరీస్ కారణంగా భారత బృందంలో ఎవరైనా కరోనా బారిన పడితే ఏంటి పరిస్థితి అని క్రికెట్ నిపుణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#Proteas SQUAD ANNOUNCEMENT 🚨
2️⃣ 1️⃣ players
Maiden Test call ups for Sisanda Magala and Ryan Rickelton 👍
Duanne Olivier returns 🇿🇦Read more here ➡️ https://t.co/ZxBpXXvQy1#SAvIND #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/6rIDzt1PuO
— Cricket South Africa (@OfficialCSA) December 7, 2021
కాగా భద్రతా కారణాలతో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కూడా మొత్తం సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నాయి కొన్ని క్రికెట్ బోర్డులు. అందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంచి ఉదాహరణ. టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు పాక్ వచ్చిన కివీస్ జట్టు.. భద్రతా కారణాలతో సిరీస్ రద్దు చేసుకుని మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే స్వదేశం వెళ్లిపోయింది. మరి క్రికెట్ ప్రపంచంలో ఒక ధనిక బోర్డుగా ఉంటూ.. ఇతర బోర్డులను, ఐసీసీని కూడా శాసించేస్థాయిలో ఉన్న బీసీసీఐ మాత్రం ఒక్క సిరీస్ రద్దు చేసుకునేందుకు మాత్రం వెనకాడుతుంది. దీన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫేయిల్యూర్‌గా చూడాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Here are the updated fixtures of India’s tour of South Africa 🇿🇦🇮🇳 #India #SouthAfrica #SAvIND pic.twitter.com/7xCskpCBSx
— Sportskeeda India (@Sportskeeda) December 6, 2021
కాసులు కూరిపించే ఐపీఎల్ లాంటి లీగ్‌నే.. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌ను మధ్యలోనే రద్దు చేసి తర్వాత యూఏఈలో నిర్వహించిన గంగూలీ.. ఈ సిరీస్‌ను ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. మరి కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న దేశానికి ఆటగాళ్లను పంపాలనే బీసీసీఐ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.