ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ క్రికెట్ లీగ్ కు లేని ఆదరణ, ఫాలోయింగ్ ఐపీఎల్ సొంతం. ఒక లీగ్ మ్యాచ్ లా కాకుండా.. ఐసీసీ మ్యాచ్ తరహాలో ప్రేక్షకాదరణ ఉంటుంది. అంతటి ప్రతిష్టాత్మక లీగ్ పై ప్రస్తుతం ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత క్రేజ్, ఆదరణ ఉన్న ఐపీఎల్ మ్యాచ్‌లలో అపైర్లు తీసుకునే నిర్ణయాలు ఎంతో దారుణంగా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్ లో అయినా అంపైర్ దే తుది నిర్ణయం. అలాంటప్పుడు ఒకటి రెండుసార్లు చూసుకుని కదా నిర్ణయం చెప్పాల్సింది అని కన్నెర్ర చేస్తున్నారు.
ఇదీ చదవండి: IPL 2022లో వివాదానికి తెరలేపిన రిషభ్ పంత్! మండిపడుతున్న మాజీలు
ఈ సీజన్ అంపైర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. వారి నిర్ణయాలు మొత్తం ఐపీఎల్ నిర్వహణను ప్రశ్నించే విధంగా మారుతున్నాయంటున్నారు. అంపైర్ కూడా మనిషే- మెషిన్ కాదు, అతను కూడా అన్ని నిర్ణయాలు అక్యురేట్ గా తీసుకోవాలని లేదు. అలాంటప్పు థర్డ్ అంపైర్ ను రివ్యూ కోరవచ్చు కదా? అదేం తప్పు కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదొక మ్యాచ్‌లో అంపైరింగ్ పై అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. వారు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని అటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు సైతం పెదవి విరుస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో బాహాటంగానే విమర్శిస్తున్నారు.ఉదాహరణకు తాజాగా ఢిల్లీ vs రాజస్థాన్ మ్యాచ్ తీసుకుందాం. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితో కుల్దీద్, పోవెల్ ను మైదానం నుంచి వచ్చేయమని పంత్ పిలిచాడు. కెప్టెన్ పిలవడంతో ఆటగాళ్లు గ్రౌండ్ వీడేందుకు సిద్ధమవగా.. అంపైర్ అడ్డుకున్నాడు. ఆ ఘటనలో కెప్టెన్ గా పంత్ చేసింది తప్పే.. కానీ, అంత స్పష్టంగా నో బాల్ అని తెలిసినా ఇవ్వకుండా ఉన్న అంపైర్ ది తప్పు కాదా? అతను నిర్ణయం తీసుకోలేనప్పుడు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయచ్చు కదా? అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. వారిదే తుది నిర్ణయం అయినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? అలాంటి నిర్ణయాలతో ఆట విశ్వసనీయత కోల్పోతుందని వాబపోతున్నారు. అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
1st ever declaration in T20 by Rishabh Pant 🤣
Pant on fire 🔥🥵
But that is clearly no ball 😏#Pant #Powell #RRvsDC #DCvRR #RishabhPant #IPL2022 pic.twitter.com/uTviM6jaAc— Nara Akhil Chowdhury (@prabhas_mania17) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.