సౌత్ ఆఫ్రికా టూర్ 2-2గా ముగిసిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి 2010 నుంచి పెండింగ్ లో ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్న టీమిండియా, ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. వర్షం కారణంగా 3.3 ఓవర్ల వద్ద మ్యాచ్ రద్దు చేయకతప్పలేదు. 3.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి టీమిండియా 28 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ ప్రారంభించే అవకాశం లేక చివరికి రద్దు చేశారు. ఒకసారి మైదానాన్ని ఒక్క చుక్క వర్షం నీరు కూడా లేకుండా శుభ్రంచేసి ఆట ప్రారంభించగా.. మళ్లీ వరుణుడు విజృంభించాడు. అయితే ప్రస్తుతం వర్షం ఆట రద్దు అయిన దానికంటే చిన్నస్వామి స్టేడియంలో ఆట చూడడానికి వెళ్లిన ప్రేక్షకులు మరో విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సౌత్ ఆఫ్రికా- టీమిండియా మ్యాచ్ చూడటానికి వెళ్లిన ప్రేక్షకులు అటు స్టేడియం, ఇటు బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షం వల్ల మైదానం ఎంత తడిసి ముద్ద అయ్యిందో.. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకులు సైతం అంతే ముద్దయ్యారు. పైన రూఫ్ ఉన్నా కూడా.. చాలా చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. మైదానంలో ఉన్నామా.. గ్యాలరీలో ఉన్నామో కూడా తేడాలేకుండా తడిసిపోయారు. ఆ వీడియో తీసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది.
Then Vacuum cleaner, hairdryer, iron and now floor rug every single thing from a common man’s home is currently being used to dry the pitch at Chinnaswamy stadium, Bangalore.
The richest cricket board in the world BCCI 😎#T20Blast #INDvSA #T20worldcup #RishabhPant #BCCI pic.twitter.com/0e8CAXBxIQ— Yogi Says (@imyogi_26) June 19, 2022
వర్షం వల్ల ఆట రద్దైన బాధ కన్నా.. బీసీసీఐ స్టేడియాలను మెయిన్‌టైన్ చేస్తున్న తీరు చూస్తుంటే ఎక్కవ బాధగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియో చూసిన నెటిజన్లు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మాత్రమే బీసీసీ ప్రపంచంలోనే అత్యంత డబ్బున్న బోర్డు.. నిర్వహణ మాత్రం ఇంత అధ్వాహ్నమా అంటూ పెదవి విరుస్తున్నారు. దానికి తోడు ఇటీవల ఐపీఎల్ మీడియా రైట్ 48 వేల కోట్లకు విక్రయించిన సందర్భాన్ని ఉంటకిస్తూ ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. అలా బోర్డుకు వస్తున్న వేల కోట్లను ఏం చేస్తున్నారంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఇంకా బీసీసీఐ స్పందించలేదు. బీసీసీఐపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What was even more disappointing was the state of affairs inside the stadium! The richest board in the world and these are the kind of conditions their fans need to put up with! When will @BCCI @kscaofficial1 improve fan experience befitting the stature of the sport?? pic.twitter.com/eacucPnwUp
— Srinivas Ramamohan (@srini_ramamohan) June 19, 2022
Whats the use of generating so much revenue when the funds cannot be utilized so as to provide better viewing experience to the end user….
— parbinder (@parbinderbadwal) June 20, 2022
ఇదీ చదవండి: శ్రీలంక Vs ఆస్ట్రేలియా వన్డేలో ఫీల్డర్ గా మారిన అంపైర్! వైరల్ అవుతున్న వీడియో
ఇదీ చదవండి: ఫ్యాన్స్ కు కొడుకుని పరిచయం చేసిన యువరాజ్ సింగ్!