టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియా కనీసం సెమీస్ చేరకుండానే తన ప్రస్థానం ముగించింది. గ్రూప్ దశలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో చతికిలపడిన టీమిండియా.. పసికూనలపై తన పంజా విసిరింది.కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా విఫలం అవ్వడానికి టాస్ ఒక కారణం కాగా.. ఆటగాళ్లకు విశ్రాంతి లేని షెడ్యూల్ మరో కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటికి తోడు అసలు టీమిండియా ఈ టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరదన్న విషయం బీసీసీఐకి ముందే తెలుసా? అన్న సెటైర్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ అనంతరం టీమిండియా స్వదేశంలో ఆడనున్న సిరీస్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే ఎవరికైనా ఈ అనుమానం కలగకమానదు. ఈ నెల 14న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అలాగే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈ నెల 17 టీమిండియా జైపూర్‌లో కివీస్‌తో టీ20 మ్యాచ్‌ఆడాల్సి ఉంది. నిజానికి ఐసీసీ మెగా టోర్నీలను అనుసరించి, మిగతా క్రికెట్ బోర్డులు తమ దైపాక్షిక సిరీస్‌లను ప్లాన్ చేసుకుంటాయి. కానీ.., బీసీసీఐ మాత్రం వరల్డ్ కప్ ముగిసిన ముడు రోజులకే కివీస్‌తో సిరీస్‌ను ఏర్పాటు చేసింది. టీమిండియా ఎలాగో సెమీస్ లేదా ఫైనల్ చేరదని ముందే తెలిసి కివీస్‌తో సిరీస్ ప్లాన్ చేసినట్లు ఉందని బీసీసీఐ పై సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి.
ఇప్పటికే విరామం లేని ఆటతో తీవ్ర ఒత్తిడి, శ్రమకు గురై అలసిపోయామని అని ఆటగాళ్లు బహిరంగంగానే తమ బాధను వ్యక్తం చేస్తుంటే, బీసీసీఐ మాత్రం ఇలా టైట్ షెడ్యూల్ ప్లాన్ చేయడంపై క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. టీమిండియా పేసర్ బుమ్రా, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే తమపై పనిభారం అధికమైందని ప్రకటించారు. ఒక వేళ టీమిండియా ఫైనల్‌కు చేరి ఉంటే 14న మ్యాచ్ ఆడి.. 15న ఇండియాకు తిరిగొచ్చి కేవలం ఒక్క రోజు తేడాతో న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడాల్సి వచ్చేది. పోని.. సీనియర్లకు విశ్రాంతి ఇస్తారని అనుకున్నా.. పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, కిషన్, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు లేకుండా టీమిండియా బరిలోకి దిగి కివీస్‌ను ఢీకొట్టలేదు కదా? వాళ్లు కచ్చితంగా జట్టులో ఉండి తీరాలి. అప్పుడు వారు కూడా విరామం లేని ఆట వల్ల ఇబ్బంది పడే ప్రమాదం ఉండేది.
ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకనైనా బీసీసీఐ ఈ బిజీ షెడ్యూల్‌పై పునరాలోచించాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఐసీసీ మెగా టోర్నీలకు ముందు, ఆ తర్వాత టీమిండియాలోని కీలక ఆటగాళ్లకు కావాల్సిన విశ్రాంతి లభించే విధంగా బీసీసీఐ షెడ్యూల్ రూపొందించాలని విశ్లేషకులు కోరుతున్నారు. మరి.. టీమిండియా బిజీ షెడ్యూల్స్ విషయంలో ప్లేయర్ల ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఇంటికొచ్చినా ఆ రికార్డులు మన పేరిటే