ఆటను, ఆటగాళ్లను అభిమానిస్తే తప్పులేదు. కానీ.. ఆ అభిమానం ముదిరి పిచ్చిగా మారి హద్దులు దాటితే ఘర్షణలు తలెత్తుతాయి. చివరికి చిన్నచిన్న కారణాలతో ప్రాణాలు పోయేవరకు వెళ్తుంది. తాజాగా మెక్సికోలోని క్వెరెటారో నగరంలో జరిగిన మెక్సికన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. బాంబులు, తుపాకులు లేవుకాని.. భీకర పోరు మాత్రం జరిగింది. క్వెరెటారో, అట్లాస్ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 62వ నిమిషంలో స్టాండ్స్‌లో అభిమానుల వివాదం మొదలైంది. ఈ ఘర్షణలో 26 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘర్షణ మొదలైన వెంటనే ఆటను నిలిపివేశారు.
మహిళలు, పిల్లలు సహా అభిమానులు స్టాండ్స్ నుంచి తప్పించుకునేందుకు వీలుగా భద్రతా సిబ్బంది మైదానంలోకి గేట్లు తెరిచారు. దీంతో భయంతో చాలామంది అటూఇటు పరుగులు తీసిశారు. ఈ ఘటనపై స్పందించిన ఫిఫా అధికారులు.. ఈ ఘటనను ఖండిస్తున్నామని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఘర్షణ సమయంలో మానిటర్ ధ్వంసమైంది. తమ ఆటగాళ్లు, అభిమానుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని మ్యాచ్ నిర్వాహకులు వెల్లడించారు. అందరూ కలిసి ఒకే సారి దాడికి పాల్పడడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేయలేకపోయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరి ఈ ఘనటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Así la bronca entre porras del Querétaro y Atlas
(VIDEO: @Radio_Formula / Erick Robledo)pic.twitter.com/f4DqTKRhvk
— Joaquín López-Dóriga (@lopezdoriga) March 6, 2022
Dramatic scenes today in Mexico. Reports of 17 dead at the Atlas vs Querétaro game.
😱😱😱 pic.twitter.com/35GGIiENwT— puritan (@puritan_777) March 6, 2022