మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్.. ప్రపంచంలోని చాలామంది ఆటగాళ్లకు ఆరాధ్య దైవం. ఆయన బ్యాటింగ్ టెక్నిక్స్ దగ్గర నుంచి మైదానంలో ప్రవర్తించే తీరు వరకు సచిన్ ని ఇప్పటి క్రికెటర్స్ ప్రతి విషయంలోనూ అనుసరిస్తుంటారు. తాజాగా పాక్ క్రికెటర్ కూడా సచిన్ ని ఫాలో అయి.. భారత క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్? ఏం జరిగింది? లాంటి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సచిన్ తెలుసు.. ఆయన రికార్డ్స్ గురించి అంతకంటే బాగా తెలుసు. ఇవన్నీ పక్కన బెడితే మైదానంలో సచిన్ ప్రవర్తించే తీరుకి కూడా చాలామంది అభిమానులున్నారు. ప్రత్యర్థి బౌలర్ ఎంత రెచ్చగొడుతున్నా సరే చాలా కామ్ గా.. కూల్ గా ఉండటం.. ఆ బౌలర్ వేసిన బంతుల్ని బౌండరీలకు తరలించి.. బౌలర్ నే సైలెంట్ చేస్తుంటాడు. అలానే ఔట్ విషయంలోనూ చాలాసార్లు క్రీడాస్ఫూర్తిని చాటుకుని.. ఎవరూ అప్పీలు చేయకపోయినా సరే తనే మైదానం నుంచి బయటకు వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇప్పుడు సేమ్ సచిన్ లానే పాక్ క్రికెటర్ కూడా ప్రవర్తించి, క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ లో భాగంగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ కు ఆవేశ్ ఖాన్ బౌలింగ్ చేశాడు. ఇక ఈ ఓవర్ లో ఓ బాల్ ని ఫకర్ జమాన్ బ్యాట్ తో బాదేందుకు ప్రయత్నించాడు. కానీ ఆది బ్యాటుని చివర్లో తాకి, కీపర్ దినేశ్ కార్తిక్ చేతిలో పడింది.
అయితే బ్యాట్ కి బంతి టచ్ అయిందని.. బ్యాట్స్ మన్ ఫకర్ జమాన్ కి తప్పించి ఎవరికీ తెలియలేదు. చుట్టూ జనం గోలగోల చేస్తుండటం వల్ల.. అటు బౌలర్ కి గానీ, ఇటు వికెట్ కీపర్ కి గానీ ఆ శబ్దం వినిపించలేదు. ఇవేవి పట్టించుకోని ఫకర్ జమాన్ నిజాయితీగా క్రీజు నుంచి మెల్లగా పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. ఇది చూసిన అంపైర్ కూడా ఔట్ గా ప్రకటించాడు. దీంతో 42 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది.
పాక్ బ్యాటర్ చూపించిన క్రీడాస్ఫూర్తికి మైదానంలోని ప్రేక్షకులతోపాటు టీవీల్లో చూస్తున్న వారు కూడా ఫిదా అయిపోయారు. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐసీసీ కూడా అద్భుతమైన క్రీడాస్ఫూర్తి అని మెచ్చుకుంది. చాలామంది బ్యాటర్స్.. ఔటైనా సరే క్రీజుని వదలకుండా ఉండిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ మాత్రం సచిన్ బాటలో.. తనకు తానుగా క్రీజుని వదలివెళ్లి.. అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఈ క్రమంలో భారత్-పాక్ మ్యాచ్ లో ఇలాంటి క్రీడాస్ఫూర్తి కనిపించడం.. నిజంగా అద్భుతమైన విషయమని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్.. సచిన్ లా క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి ప్రపంచ క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడని పలువురు కొనియాడారు. మరి జమాన్ క్రీడాస్ఫూర్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
— Guess Karo (@KuchNahiUkhada) August 28, 2022
— Guess Karo (@KuchNahiUkhada) August 28, 2022