నేటితో ధనాధన్ క్రికెట్ హంగామా ఐపీఎల్ షురూ కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్‌తో రిచ్ లీగ్ సమరం ప్రారంభం కానుంది. కాగా లీగ్ ఆరంభానికి ముందు CSK కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు ప్రకటించి ధోని షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. గతంలో ధోని కెప్టెన్సీలోనే డుప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ధోని CSK కెప్టెన్‌గా తప్పుకోవడంపై స్పందిస్తూ.. ఫాఫ్ భావోద్వేగానికి గురయ్యాడు.
ధోని కెప్టెన్సీలో ఆడడం తాను చేసుకున్న అదృష్టమని డుప్లెసిస్ అన్నాడు. అతను అద్భుత లీడర్ అని.. ధోని నుంచి ఎంతో నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన జాతీయ జట్టు.. సౌతాఫ్రికాకు ఆడుతున్న ఆ సమయంలో గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్ అండర్‌లో కూడా ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు. స్మిత్, డివిలియర్స్, ధోని తన దృష్టిలో బెస్ట్ కెప్టెన్లని డుప్లెసిస్ వెల్లడించారు. వీరి ముగ్గురి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. ఐపీఎల్‌లో డుప్లెసిస్ తొలిసారి కెప్టెన్సీ చేయనున్నాడు.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా తప్పుకోవడంతో అతని స్థానంలో డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించింది ఆర్సీబీ మేనేజ్‌మెంట్. ఐపీఎల్‌లో భీకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఐపీఎల్ టైటిల్ కొట్టలేదు. కొత్త కెప్టెన్ డుప్లెసిస్ అయినా ఆ కోరత తీర్చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి డుప్లెసిస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
IPL 2022: Faf du Plessis Names 3 Best Captains https://t.co/3y7qQOFIEO
— Sayyad Nag Pasha (@PashaNag) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.